Thursday, May 28, 2026

Tata Tiago Facelift: పాత కారే.. కానీ కొత్తగా వస్తోంది..

Tata Tiago Facelift:Tata మోటార్స్ నుంచి ఇప్పటికే ఎన్నో రకాల కార్లు వినియోగదారులను అలరించాయి. ఈ కంపెనీకి చెందిన Tiago అమ్మకాలు టాప్ లెవల్లో ఊంటూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ కారును సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విడుదల చేయడానికి కంపెనీ సిద్ధమైంది. దీనిని మే 28న మార్కెట్లోకి తీసుకువస్తుంది. ఇప్పటికే విడుదలయిన కొన్ని ఫొటోలు, వీడియోలతో ఈ కారు డిజైన్ అద్భుతం అని అనుకోవచ్చు. అయితే ఇందులో ఉండే ఇంజిన్, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Tata Tiago Facelift కారు పనితీరు విషయానికి వస్తే.. ఇందులో 1.2-లీటర్ నేచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉంటుంది . ఈ ఇంజిన్ గరిష్టంగా 86 బిహెచ్‌పి పవర్, 113 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇంజిన్ పనితీరులో తీసుకువచ్చిన ఈ మార్పులు నగరాల్లో ప్రయాణించేవారితో పాటు హైవేలపై డ్రైవింగ్ చేసేవారికి మంచి అనుభూతిని అందిస్తుంది.

క్యాబిన్ లోపల మార్పులు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ కారులో పునఃరూపకల్పన చేసిన డాష్‌బోర్డ్, సవరించిన డోర్ ప్యాడ్‌లు కొత్తగా చేర్చిన ఫ్రంట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ సౌకర్యాన్ని పెంచుతాయి. ఇంటీరియర్‌ను డ్యూయల్-టోన్ బ్లాక్ మరియు గ్రే ఫాబ్రిక్ అప్హోల్స్టరీతో ప్రీమియంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా, గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన సెంట్రల్ కన్సోల్, రెండు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌లు, కొత్త డిజైన్ ఏసీ వెంట్స్ మరియు స్టైలిష్ టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ కారుకు మరింత ఆధునిక రూపాన్ని ఇచ్చాయి.

ధర విషయానికొస్తే, అధికారికంగా మే 28న విడుదల అయ్యే సమయంలో టాటా మోటార్స్ పూర్తి ధరల వివరాలను వెల్లడించనుంది. అయితే మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం.. మెరుగైన ఫీచర్లు మరియు ఇంజిన్ అప్‌డేట్ల దృష్ట్యా, ప్రస్తుత మోడల్ కంటే స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. ధరలు సుమారు రూ. 5.65 లక్షల నుండి రూ. 8.50 లక్షల మధ్యలో ఉండవచ్చని భావిస్తున్నారు. ఆకర్షణీయమైన లుక్, పటిష్టమైన తయారీతో వస్తున్న ఈ కొత్త టియాగో, బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో మరోసారి సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News