Tuesday, October 13, 2026

Brahmanandam Negative Role: విలన్ గా నటించి మెప్పించిన బ్రహ్మానందం.. ఏ సినిమానో తెలుసా?

Brahmanandam Negative Role: తెలుగు సినీ ప్రేక్షకులను దశాబ్దాలుగా తన కామెడీతో నవ్విస్తున్న నటుడు బ్రహ్మానందం. హాస్యనటుడిగా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో భాగమైన ఆయన.. అవసరమైనప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. అయితే ఆయన కేవలం కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా ప్రతీకారం తీర్చుకునే పూజారి పాత్రలో నటించి.. ఒక రకంగా విలన్ గా నటించారు. ఇంతకీ బ్రహ్మానందం నెగెటివ్ రోల్ చేసిన మూవీ ఏదంటే?

ఈ ఏడాది సెప్టెంబర్ 11న థియేటర్లోకి వచ్చిన మైథలాజికల్ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ ‘మహేంద్రగిరి వారాహి’. సైలెంట్ గా వెండితెరపైకి వచ్చిన ఈ మూవీకి దర్శకుడు సంతోష్ జాగర్లమూడి. కలీపు మధు, సురభి లక్ష్మణ్ రావు నిర్మాతలు గా వ్యవహరించిన ఇందులో సుమంత్ హీరోగా నటించారు. ఈ సినిమాలో బ్రహ్మానందం పూజారి పాత్రలో కనిపించారు. అయితే ఆ పూజారే సినిమాకు విలన్ అన్న విషయం చివరి వరకు తెలియదు.

ఈ సినిమా కథ విషయానికొస్తే..మహేంద్రగిరి ప్రాంతానికి చెందిన ఒక రాజు దాదాపు 200 ఏళ్ల కిందట చేసిన తప్పుకు శాపం వెంటాడుతుంది అన్న ప్రధాన అంశంలో సినిమా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఆ వంశంలోని పురుషులు 33 ఏళ్ల వయసుకు చేరుకున్నప్పుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తుంటారు. ఈ మరణాలకు నిజంగానే దైవశాపమే కారణమా? లేక వాటి వెనుక మనుషులు సృష్టించిన కుట్రలా.. అన్న విషయాన్ని హీరో సుమంత్ ఛేదిస్తాడు.

ఎన్నో రకాలుగా రీసెర్చ్ చేయగా.. చివరికి వారాహికి పూజ చేసే పూజారితో పాటు అతడి స్నేహితుడు కలిసి ఈ హత్యలు చేస్తున్నారని నిరూపితమవుతుంది. ఒకప్పుడు ఈ రెండు కుటుంబాలకు చెందిన వారు ఈ హత్యలు చేయడం ప్రారంభించగా.. ఈ తంతు కొనసాగుతుంది. అయితే బ్రహ్మానందం అప్పటి వరకు పూజారి పాత్రలో కనిపించడంతో అంతా సాధారణమే అనుకుంటారు. కానీ ఈ సినిమాకు ఆయనే కీ రోల్.. అందులోనూ.. విలన్ అని తెలిశాక.. అంతా షాక్ అవుతారు. అయితే ఆయన విలనిజం కాసేపు మాత్రమే ఉన్నా.. బ్రహ్మానందంను ఇలా కూడా చూడొచ్చా…? అన్న ఆశ్చర్యం కలుగుతుంది.

ఇప్పటి వరకు కొన్ని సినిమాల్లో విలన్ పక్కన నటించి.. కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో నటించారు. కానీ ఈ సినిమాలో ఆయన నటనను చూసి అంతా షాక్ అయ్యారు. ఏదీ ఏమైనా బ్రహ్మానందం కమెడియన్ మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. హీరోగా.. చివరికి విలన్ గా మెప్పించారు. ఇక ఈ మూవీ అక్టోబర్ 1 నుంచి అమెజాన్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News