Friday, October 2, 2026

Telangana, Senior Citizens: సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్‌.. త్వరలో ఉచిత బస్సు పాస్‌లు?

Telangana, Senior Citizens: తెలంగాణలోని సీనియర్ సిటిజన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. ఇక నుంచి వృద్ధులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉండే అవకాశం ఉంది. దీనిపై పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళితె..

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గురువారం ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వృద్ధుల సంక్షేమం, వారికి అందాల్సిన ప్రభుత్వ సేవలు, సామాజిక భద్రత వంటి అంశాలపై చర్చ జరిగింది.

Three Wheel Scooters: 1000 మందికి మూడు చక్రాల స్కూటీలు.. అర్హులు వీరే.. – insightearth.in – Telugu News Portal

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్ పాస్‌లు అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన అంశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇది ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్న అంశమేనని, తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం అవుతోంది.

ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తే ప్రధానంగా వృద్ధ పురుషులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అమలులో ఉంది. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్ పాస్‌లు తీసుకొస్తే వృద్ధ పురుషులు కూడా ప్రజా రవాణాను ఉచితంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది.

సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్ పాస్‌ల అంశంపై చర్చ జరుగుతున్నప్పటికీ.. అర్హత వయసు, ఆదాయ పరిమితి, పాస్ చెల్లుబాటు, ఏ బస్సుల్లో వర్తిస్తుంది, రాష్ట్రవ్యాప్తంగా వర్తిస్తుందా లేదా వంటి నిబంధనలు ఇంకా ఖరారు కాలేదు. ప్రభుత్వం అధికారికంగా మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాతే అర్హుల వివరాలు స్పష్టంగా తెలుస్తాయి.

సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్ పాస్‌లు అమల్లోకి వస్తే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)పై కూడా అదనపు బాధ్యత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలవుతున్న నేపథ్యంలో సీనియర్ సిటిజన్లకు మరో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News