Tuesday, May 26, 2026

Honda ADV160: బైక్ లాంటి స్కూటర్.. ధర ఎంతో తెలుసా..

Honda ADV160: Honda సంస్థ తన ప్రతిష్టాత్మక ‘ADV160’ మ్యాక్సీ-స్కూటర్ డిజైన్ పేటెంట్‌ను భారత్‌లో నమోదు చేయడం ఆటోమొబైల్ రంగంలో పెద్ద చర్చకు దారితీసింది. ఇది చూడటానికి అచ్చం అడ్వెంచర్ బైక్ లాగా కనిపిస్తుంది. కానీ పనితీరులో స్కూటర్ లాగా ఉండటంతో వాహన ప్రియులు దీనిని చూసి ఆశ్చర్యపోతున్నారు. సాధారణ స్కూటర్ల కంటే భిన్నమైన మస్క్యులర్ డిజైన్, షార్ప్ ఎడ్జెస్ మరియు అడ్వెంచర్ లుక్‌తో ఇది పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌ను సూచిస్తోంది. దీని గురించి వివరాల్లోకి వెళితె..

Honda ADV160 చూడ్డానికి అచ్చం బైక్ లాగా కనిపిస్తుంది. కానీ ఇది సాంకేతికంగా ఒక ‘మ్యాక్సీ-స్కూటర్’. దీనికి సాధారణ స్కూటర్లలాగా ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్ ఉండదు, బదులుగా మధ్యలో ‘సెంట్రల్ స్పైన్’ ఉంటుంది, ఇది బైక్ లాంటి స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది. అంతేకాకుండా, దీనిలో ఉండే 157cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్, అడ్వెంచర్-స్టైల్ సస్పెన్షన్ మరియు భారీ బాడీ ప్యానెల్స్ దీనిని ఒక శక్తివంతమైన మ్యాక్సీ-స్కూటర్‌గా నిలబెడుతున్నాయి. అలాగే లీటర్ ఇంధనానికి ఇది 40 నుంచి 45 కిలోమటర్ల మైలేజ్ అందిస్తుంది.

Save Money: ఈ ఐదింటిని తగ్గిస్తే.. ఆర్థిక కష్టాలు ఉండవు.. – insightearth.in – Telugu News Portal

దీని ఫీచర్ల విషయానికొస్తే.. ADV160 అత్యాధునిక సాంకేతికతతో వస్తోంది. ఇందులో ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎత్తును సర్దుబాటు చేసుకోగలిగే విండ్‌స్క్రీన్, కీలెస్ ఇగ్నిషన్ (Smart Key), ట్రాక్షన్ కంట్రోల్ , ఏబీఎస్ (ABS) వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, సీటు కింద సుమారు 27-30 లీటర్ల నిల్వ సామర్థ్యం ఉండటం వల్ల ఇది సిటీ ప్రయాణాలకే కాకుండా, లాంగ్ టూరింగ్‌కు కూడా చాలా అనువుగా ఉంటుంది.

ప్రస్తుతానికి హోండా దీనిని భారతదేశంలో విడుదల చేస్తుందని అధికారికంగా ప్రకటించనప్పటికీ, పేటెంట్ ఫైల్ చేయడం వల్ల ఇది త్వరలోనే భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ ఇది లాంచ్ అయితే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ‘యమహా ఏరోక్స్ 155’ (Yamaha Aerox 155) మరియు ‘హీరో జూమ్ 160’ (Hero Xoom 160) వంటి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ స్కూటర్లకు గట్టి పోటీనివ్వడం ఖాయం. అమెరికన్ మార్కెట్లో 4,499 డాలర్లుగా నిర్ణయించారు. ఒకవేళ భారత్ లోకి వస్తే రూ.1.55 లక్షలకు విక్రయించే అవకాశం ఉందని అంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News