Saturday, May 30, 2026

New Trend in Weddings: పెళ్లి చూపుల్లో కొత్త ట్రెండ్.. ట్రాఫిక్ రికార్డులు చెక్ చేసిన కూతురు తండ్రి!

New Trend in Weddings: ‘పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక’ అని పెద్దలు చెబుతుంటారు. అందుకే పెళ్లి సంబంధం చూసే సమయంలో కుటుంబ నేపథ్యం, ఆర్థిక స్థితి, విద్య, ఉద్యోగం, అలవాట్లు వంటి ఎన్నో విషయాలు పరిశీలిస్తారు. కొందరు పెద్దలు ‘ అటు ఏడు తరాలు..ఇటు ఏడు తరాలు చూడాలి’ అని చెబుతూ ఉంటారు. కానీ కాలం మారుతున్న కొద్దీ పెళ్లి సంబంధాలు చూసే విధానంలో కూడా కొత్త ఆలోచనలు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి ఆసక్తికర సంఘటనే తాజాగా కాకినాడలో వెలుగుచూసింది. పెళ్లి సంబంధం విషయంలో తన కూతురు జీవితం బాగుండాలని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అసలు ఆయన వెళ్లడానికి కారణమేంటీ?

కాకినాడకు చెందిన ఓ తండ్రి తన కూతురికి కాబోయే వరుడి గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకున్నాడు. దీంతో తనకు అందిన సాధారణ వివరాలతో సరిపెట్టుకోలేదు. ‘వ్యక్తి నిజంగా ఎంత బాధ్యతాయుతంగా ఉంటాడు? సమాజం పట్ల అతడి వైఖరి ఎలా ఉంటుంది?’ అనే కోణంలో ఆలోచించాడు. ఎందుకంటే చదువు, ఉద్యోగం, జీతం మంచిగా ఉండటం మాత్రమే సరిపోదని.. రోజువారీ జీవితంలో వ్యక్తి ప్రవర్తనే అసలు వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని భావించాడు.

ఈ క్రమంలో ఆ తండ్రి వరుడి ఆధార్ వివరాలు, ఫోన్ నంబర్‌తో పాటు అతడు ఉపయోగించే కారు, బైక్ నంబర్లను సేకరించాడు. తర్వాత నేరుగా ట్రాఫిక్ పోలీసులను సంప్రదించాడు. అక్కడ ట్రాఫిక్ సీఐని కలిసి ఆ యువకుడిపై ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్నాయా అని ఆరా తీశాడు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ర్యాష్ డ్రైవింగ్, అధిక వేగం, పెండింగ్ చలానాలు వంటి అంశాలపై వివరాలు అడిగాడు.

మొదట ఈ విచారణ విన్న ట్రాఫిక్ పోలీసులు కూడా కాసేపు ఆశ్చర్యపోయారట. సాధారణంగా వాహన యజమానులు తమ చలానాలు తగ్గించుకోవడానికి లేదా కేసుల వివరాలు తెలుసుకోవడానికి వస్తుంటారు. కానీ కూతురికి కాబోయే అల్లుడి ప్రవర్తన తెలుసుకోవడానికి ఒక తండ్రి రావడం వారికి కొత్త అనుభవంగా అనిపించింది.

రికార్డులు పరిశీలించిన ట్రాఫిక్ సీఐ.. ఆ యువకుడిపై ఎలాంటి తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలు లేవని, పెండింగ్ చలానాలు కూడా లేవని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతగా వాహనం నడుపుతున్నాడని చెప్పారు. దీంతో ఆ తండ్రి ఊపిరిపీల్చుకున్నాడు. అంతేకాకుండా యువకుడి క్రమశిక్షణను ప్రశంసించాడు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ కూడా ఆ తండ్రి ఆలోచనను అభినందించారు. ‘ప్రస్తుతం చాలా మంది పెళ్లి సంబంధాల్లో ఆస్తి, జీతం, విదేశీ ఉద్యోగాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ వ్యక్తి సామాజిక బాధ్యత, రోడ్డు నిబంధనల పట్ల అవగాహన కూడా చాలా ముఖ్యమే’ అని పేర్కొన్నట్లు సమాచారం.

మనిషిలో నవ్వు ఎందుకు వస్తుంది? – insightearth.in – Telugu News Portal

నిజానికి రోడ్డు మీద వాహనం నడిపే తీరు కూడా ఒక వ్యక్తి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించే వారు సాధారణంగా క్రమశిక్షణ, ఓర్పు, బాధ్యతతో వ్యవహరిస్తారని భావిస్తారు. అదే తరచూ ర్యాష్ డ్రైవింగ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడటం వంటి చర్యలు నిర్లక్ష్య ధోరణిని సూచిస్తాయని అంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News