Thursday, July 30, 2026

Honda Rebel 500 ధర లీక్.. ఆ బైక్ కు గట్టి పోటీ..

Honda Rebel 500: భారత మార్కెట్లోకి త్వరలోనే అడుగుపెట్టబోతున్న హోండా యొక్క పవర్ ఫుల్ క్రూయిజర్ బైక్ ధర లీక్ అయింది. హోండా రెబెల్ 500 గా రాబోతున్న ఈ బైక్ మార్కెట్లోకి వస్తే రాయల్ ఎన్ ఫీల్డ్ తో పాటు ఇతర వాటికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇంతకీ ఈ బైక్ ధర ఎంతంటే?

హోండా కంపెనీ నుంచి ‘రెబెల్ 500’ బైక్‌లో 471 సీసీ, లిక్విడ్ కూల్డ్, పారలల్ ట్విన్ ఇంజిన్ అమర్చారు. ఇది 8,500 RPM వద్ద 46 bhp శక్తిని, 6,000 RPM వద్ద 43.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. భారత మార్కెట్‌లో ఇది అధికారికంగా లాంచ్ అయిన తర్వాత, క్రూయిజర్ సెగ్మెంట్‌లో బాగా ప్రాచుర్యం పొందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటియోర్ 650 బైక్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.

అయితే ఈ బైక్ గురించి ప్రకటించినప్పటి నుంచి ఎక్స్-షోరూమ్ ధరపై ఆసక్తి పెరిగింది. కానీ దీని విడుదలకు ముందే ధర ఆన్‌లైన్‌లో లీక్ అయింది. హోండా బిగ్‌వింగ్ బెంగళూరు వెబ్‌సైట్‌లో వెల్లడైన వివరాల ప్రకారం, ఈ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.49 లక్షలు గా ఉండవచ్చని తెలుస్తోంది. భారత్‌లో ఈ సంవత్సరంలోనే అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ, హోండా కంపెనీ ఇప్పటివరకు నిర్దిష్ట లాంచ్ తేదీని మాత్రం ప్రకటించలేదు.

ఈ బైక్‌ను భారతదేశానికి సీకేడీ మార్గం ద్వారా తీసుకురానున్నారు. విడిభాగాల రూపంలో తెచ్చి ఇక్కడే అసెంబుల్ చేయడం వల్ల ధరను వీలైనంత అందుబాటులో ఉంచడానికి వీలవుతుంది. బెంగళూరు డీలర్‌షిప్‌లో వెల్లడైన రూ. 5.49 లక్షల ధర ఖరారైతే, గతంలో భారత్‌లో లభించిన పాత తరం మోడల్ కంటే ఇది చాలా సరసమైనదిగా మారుతుంది. గతంలో విక్రయించిన పాత తరం రెబెల్ 500 చివరి ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.26 లక్షలుగా ఉండేది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News