The Pinocchio Mystery: ఈ ఊసరవెల్లి అసలు రంగు బయటపడింది..!(వీడియో)ఒక వ్యక్తి లక్షాణాల గురించి చెప్పేటప్పుడు ఊసరవెల్లి ప్రస్థావన వస్తుంది. ఊసరవెల్లి రంగులు మారినట్లు ఆ వ్యక్తి తన క్యారెక్టర్ మారుస్తున్నారని చెబుతారు. అయితే ఊసరవెల్లి కొన్ని సమయాల్లో.. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. కానీ ఊసరవెల్లిలు ఎక్కువగా ఉన్న ఓ ప్రదేశం ఉంది. దీనిని ఊసరవెల్లి దేశం అని అంటారు. అయితే ఇటీవల ముక్కు పొడవుగా ఉన్న ఓ ఊసరవెల్లి గురించి ఆసక్తిగా చర్చ సాగుతోంది. ఈ ఊసరవెల్లిపై 150 ఏళ్లుగా పరిశోధనలు జరిగాయి. చివరికి దీనిని Calumma nasutum అనే జాతికి చెందినదిగా గుర్తించారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఊసరవెల్లిలు ఉన్నాయి? వీటి జీవిన విధానమేంటి? ముక్కు పొడవుగా ఉన్న ఈ ఊసరవెల్లిపై ఎందుకు పరిశోధన చేశారు?
మడగాస్కర్.. ఊసరవెల్లిల దేశం
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 236 జాతుల ఊసరవెల్లిలు ఉన్నాయి. అయితే మడగాస్కర్ దీపంలో ప్రపంచంలోని 40% కంటే ఎక్కువ ఊసరవెల్లి జాతులు ఉన్నాయి. ఈ దీపంలో 100 ఊసరవెల్లి జాతులు గుర్తించబడ్డాయి. అందుకే దీనిని ఊసరవెల్లి దేశంగా పిలుస్తారు. అయితే వీటిలో పినోకియో ఊసరవెల్లి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీని గురించి 150 ఏళ్లుగా పరిశోధనలు జరగుతున్నాయి. అయితే ఈ ఊసరవెల్లి శాస్త్రవేత్తలను మోసం చేసిందని అంటున్నారు. ఎందుకంటే?

మడగాస్కర్ దీపంలో దాదాపు 150 ఏళ్లుగా శాస్త్రవేత్తలను మోసం చేసిన ఒక వింత ఊసరవెల్లి ఉంది. దీని ముక్కు చాలా పొడవుగా, పినోకియో కథానాయకుడి ముక్కులా ఉండడం వల్ల దీనికి “పినోకియో చమేలియన్” అని పేరు వచ్చింది. ఈ ఊసరవెల్లిని ఇప్పటివరకు Calumma nasutum జాతికి చెందినదిగా గుర్తించారు. కానీ ఇది తప్పు అని తేలింది. 2025 లో జరిగిన పరిశోధనలో దీని డీఎన్ఏ విశ్లేషణ చేసిన తరువాత.. ఇది పూర్తిగా వేరే జాతికి చెందినది అని తెలిసింది. ఇప్పుడు దీనికి Calumma pinocchio అనే శాస్త్రీయ నామం ఇచ్చారు .
శాస్త్రవేత్తలు ఈ ఊసరవెల్లికి సంబంధించిన జన్యు (genetic), ఆకృతి (morphological) విశ్లేషణలు చేశారు. దీని కోసం వారు “ముజియోమిక్స్” (museomics) అనే పద్ధతిని ఉపయోగించారు.. అంటే 1836 నాటి పాత మ్యూజియం నమూనాల నుండి కూడా డీఎన్ఏ సేకరించి పరిశీలించారు. ఈ పరిశోధనలో ముఖ్యంగా ఈ క్రింది విషయాలు బయటపడ్డాయి:
దీని ముక్కు ఎందుకు పొడవుగా ఉంటుంది?
మగ పినోకియో ఊసరవెల్లి ముక్కు పొడవుగా ఉండటం వల్ల ఆడ ఊసరవెల్లులను ఆకర్షిస్తుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. ఈ ముక్కు మగ ఊసరవెల్లి ఆరోగ్యం, బలం, జన్యువుల నాణ్యతను సూచిస్తుంది. ఆడ ఊసరవెల్లి ముక్కు పొడవు, రంగు, ఆకారం బట్టి మగవారిని ఎంచుకుంటుంది. దీనివల్ల ముక్కు పరిణామం చాలా వేగంగా జరుగుతోంది.
ప్రమాదంలో ఉన్న జాతి..
పినోకియో ఊసరవెల్లి ప్రస్తుతం ప్రమాదంలో ఉన్న జాతి (Endangered) గా పరిగణించబడుతోంది. ఎందుకంటేదీని నివాస ప్రాంతం చాలా పరిమితం. వర్షారణ్యాలు కత్తిరించడం.. వ్యవసాయం వల్ల నివాసాలు క్షీణిస్తున్నాయి. జనాభా చిన్న చిన్న ఖండాలుగా విడిపోయి, ఒకదానితో ఒకటి కలవలేకపోతున్నాయి.





