మనకు కబడ్డీ క్రీడ తెలసు.. ఖొఖో ఆట తెలుసు.. ఈ ఆటలు పరుషులతో పాట మహిళలు కూడా ఆడుతారు. అయితే భార్యభర్తలు కలిసి ఆడే క్రీడల కొన్ని ఉంటాయి. కానీ ఓ క్రీడలో భర్త మాత్రమే బరువులు మోయాల్సి ఉంటుంది. ఆ బరువు ఎవరితో కాదు.. భార్యదే. దీనినే Wife Carring Race అని అంటారు. భర్త తన భార్యను ఎత్తుకొని పరుగెత్తాల్సి ఉంటుంది. ఈ పోటీలు ప్రతీ జూలై మాసంలో జరుగుతూ ఉంటాయి. ఈసారి కూడా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ క్రీడా పోటీలు ఎప్పుడు? ఎక్కడ? ప్రారంభం అయ్యాయి. వీటిని ఎలా నిర్వహిస్తారు?
Wife Carring Race ఫిన్లాండ్ దేశంలోని సోంకజార్వి పట్టణంలో ఎక్కువగా నిర్వహిస్తారు. మొట్టమొదటిసారిగా 1922లో ఈ క్రీడను ఇక్కడే ప్రారంభించారు. అయితే ఈ క్రీడ ప్రారంభం వెనక ఓ కథ ఉంది. 1800 సంవత్సరంలో అడవిలో నివసించే కొందరు దొంగలు గ్రామస్థులకు హాని కలిగించేవారు. ఇదే సమయంలో కొందరు మహిళలన అపహరించి వీపులపై మోసుకెళ్లేవారు. ఆ తరువాత కొందరు యువకులు మహిళలన అపహరించి బలవంతంగా పెళ్లి చేసుకునేందుక ఇలా వీపుపై మోసుకెళ్లేవారు. ఈ యువకులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేవారని చరిత్ర తెలుపుతోంది. ఆలా ఇది క్రీడగా మారిపోయింది.
ఈ పోటీలు మొదట్లో ఫిన్ లాండ్ దేశంలో ప్రారంభం అయినా.. ఆ తరువాత ఆస్ట్రేలియా, అమెరికా, హాంకాంగ్, జర్మనీతో పాటు భారత్ లోనూ కొన్ని ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. భార్య వయసు 17 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండి.. 49 కిలోలు ఉండాలి. అయితే భార్య బరువు తక్కువగా ఉంటే.. అంతకు సమానంగా బరువు వస్తువును చేతిలో పెడతారు. అంటే మొత్తం 49 కిలోల బరువుతో పరుగెత్తాలి. ఈ పరుగుపందెంలో గెలిస్తే భార్య బరువుక సమానమైన బీరును అందిస్తారు. ఈ పోటీలు 1997 నుంచి అధికారికంగా నిర్వహిస్తున్నారు. మొదటిసారిగా ఇందులో ఫిన్ లాండ్ కు చెందిన Jouni Jussila, Tina Jusslaఅనే జంట గెలుపొందింది. 2024లో Vytautas Kirkiauskas, Neringa Kirkliauskience అనే జంట విజయం సాధించింది. అయితే 2025లో ఈ పోటీలు నిర్వహించనున్నారు.