Tuesday, June 24, 2025

ట్రంప్ పై మరోసారి కాల్పులు..? ఈసారి నిందితుడు ఎవరంటే?

అమెరికా మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పై మరోసారి కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ట్రంప్ ను లక్ష్యం చేసుకునే ఈ కాల్పలు జరిగాయా? అనేది తెలియాల్సి ఉంది. గతంలో ఓసారి ట్రంప్ పై హత్యాయత్నం జరగగా తృటిలో తప్పించుకున్నారు. ఆయనపై మరోసారి కాల్పుల ఘటన జరగడంతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కి పడ్డారు. త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్ ఉన్న ప్రదేశంలో ఇలా రెండోసారి కాల్పుల ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ట్రంప్ పై పోటీ చేస్తున్న ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ స్పందించారు. అలాగే 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఎవరంటే?

అమెరికా సీక్రెట్ సర్వీస్ తెలిపిన ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ట్రంప్ ప్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్ లోఇంటర్నేషనల్ గోల్ప్ క్లబ్ లో గోల్ప్ ఆడుతుండగా కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పులు ట్రంప్ లక్ష్యంగా చేసుకొని జరిగాయా? అనేది ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. అయితే ట్రంప్ భద్రతా సిబ్బంది మాత్రం ఆయన ఉన్న ప్రదేశంలోనే కాల్పుల ఘటన జరిగిందని నిర్దారణకు వచ్చారు. ఈ ఘటనపై ట్రంప్ స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని అన్నారు. అయితే తన ఎన్నికల ప్రచారం ఆపబోమని పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు ప్రత్యర్థిగా ఉన్న కమలాహారిస్ ఈ ఘటనపై స్పందించారు. ఈ కాల్పుల ఘటనను ఆమె ఖండించారు. అమెరికాలో హింసకు తావు లేదని అన్నారు. కాల్పులు జరిగినట్లు మాకు సమాచారం అందిందని అయితే ఈ విషయాన్ని అధ్యక్సుడు బైడెన్ తెలిపామన్నారు. ట్రంప్ సురక్షితంగానే ఉన్నారని తెలిపారు.

ఇక ఈ ఏడాది జూలై 14న ట్రంప్ ప్రచారంలో ఉండగా ఆయనపై థామస్ మాథ్యూ క్రూక్స్ కాల్పులు జరిపాడు. ఇది జరిగిన కొద్ది సేపటికే సెక్యూరిటీ సిబ్బంది అతనిని మట్టు పెట్టారు. అయితే తాజాగా కాల్పులు జరిపింది ర్యాన్ వెస్లీ రౌత్ గా అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు ఏకే 47 ను అదుపులోకి తీసుకున్నారు. 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ నార్త్ కరోలినా అగ్రి కల్చరల్ అండ్ టెక్నికల్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకున్నాడని, ఆ తరువాత హవాయికి షిప్ట్ అయ్యాడని లింక్డ్ ఇన్ ను బట్టి న్యూయార్క్ పోర్టల్ లు వెల్లడించాయి. ఈయన 2003లో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడంతో కేసు నమోదైంది. 2010లో దొంగతనానికి పాల్పడ్డాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News