Tuesday, June 24, 2025

దుర్యోధనుడికి ప్రత్యేక ఆలయం..మద్యంతో నైవేద్యం.. ఎక్కడుందో తెలుసా?

మహాభారతంతో దుర్యోధనుడి గురించి తెలియని వారుండరు. క్రూరత్వానికి, అణిచితేతకు ప్రతిరూపంగా ఈ పాత్ర మనకు కనిపిస్తుంది.మహాభారతంలో పాండవులను దేవుళ్లుగా కొలుస్తారు. శ్రీ కృష్టుడు ఇరువైపులా ఉన్నా పాండవులకే మద్దతు ఎక్కువగా ఇస్తారు. కానీ కౌరవుల వైపు ఉన్న దుర్యోధనుడు కాస్త కఠినంగా కనిపించినా.. ఆయన కొన్ని విషయాల్లో సౌమ్యుడే అని అంటారు. అందుకే ఆయనను కొందరు దేవుడిగా కొలుస్తారు. ఈ తరుణంలో దుర్యుధనుడికి ప్రత్యేకంగా ఓ ఆలయం నిర్మించి నిత్యం పూజలు చేస్తున్నారు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుందో తెలుసా?

ప్రముఖ ఆలయాలకు కొలువైన కేరళ రాష్ట్రంలో దుర్యోధనుడి ఆలయాన్ని నిర్మించారు.కొల్లాం జిల్లాలోని పోరువలి అనే గ్రామంలో మలనాడుపై దుర్యోధనుడి ఆలయం కనిపిస్తుంది. అయితే దేశలంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ దుర్యోధనుడి ఆలయం నిర్మించడం వెనుక ఓ చరిత్ర ఉంది. మహాభారత సమయంలో జూదంలో పాండవులు ఓడపోయిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఏడాది పాటు వనవాసం వెళ్తారు. అయితే వనవాసంలో ఉన్న సమయంలో పాండవుల జాడ తెలుసుకునేందుకు దుర్యోధనుడు వివిధ పథకాలు వేస్తారు.

ఈ క్రమంలో దుర్యోధనుడే స్వయంగా పాండవుల జాడకోసం బయలుదేరుతాడు. కొన్ని మైళ్ల ప్రయాణం తరువాత దాహం వేస్తుంది. ఈ సమయంలో ఓ మహిళ తన వద్ద ఉన్న కొబ్బరి కల్లును దుర్యోధనుడికి ఇస్తుంది. ఆ కల్లు తాగిన దుర్యోదనుడు దప్పిక నుంచి ఉపశమనం పొందుతాడు. ఆమె చేసిన సాయానికి కానుకగా తన రాజ్యంలోని ఆ ప్రాంతాన్ని వారికి కానుకగా ఇస్తాడు. ఆ ప్రాంతం మలనాడు కొండపై ఉంటుంది. ఈ కొండపై కూర్చొని దుర్యోధనుడు ఇక్కడి ప్రజలు సుఖ శాంతులతో జీవించాలని ప్రార్థిస్తాడు. ఆ విశ్వాసంతో అక్కడి ప్రజలు దుర్యోధనుడికి ఆలయం కట్టించారు.

సాధారణంగా దేవుళ్లను పూజించే సమయంలో మాంసం, మద్యం దూరంగా ఉంచుతారు. కానీ దుర్యోధనుడి ఆలయం స్పెషల్ ఏంటంటే.. ఇక్కడ వివిధ పదార్థాల నైవేద్యంతో పాటు మద్యంను సమర్పిస్తారు. ఇక్కడి కల్లుకు దుర్యోధనుడు ఆకర్షితుడయ్యానే కారణంగా మద్యంను నైవేద్యంగా సమర్పిస్తారు. కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లా కేంద్రం నుంచి మలనాడుకు 31 కిలోమీటర్ల దూరం ప్రయాణం ఉంటుంది. కొల్లా రైల్వేస్టేషన్ నుంచి నేరుగా ఇక్కడికి క్యాబ్ లేదా బస్సు ద్వారా వెళ్లొచ్చు. రోడ్డు మార్గం నుంచి ఇక్కడికి కొచ్చి నుంచి 125 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News