ప్రకృతి లో ఎన్నో వింతలు, విశేషాలు కలిగి ఉంటాయి. ఊహకందని అందాలు ఉంటాయి. ఎవరూ ఊహించని ఆహార పదార్థాలు ఉంటాయి. వీటి వల్ల ఎన్నో ఆఱోగ్య ప్రయోజనాలుంటారు. ప్రకృతిలో లభించే పండ్లు, కూరగాయలు మానవ జీవనమనుగడకు ఎంతో ఉపయోగాన్ని ఇస్తాయి. కొన్ని పండ్లు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. కానీ వాటిని చూస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సాధారణంగా ఎవరైనా పామును చూడగానే భయానికి గురవుతారు. పాముకున్న స్కిన్ చూస్తే ఇంకా భయం వేస్తుంది. కానీ పాము తోలు కలిగిన కొన్ని పండ్లు ఉన్నాయన్న విషయం తెలుసా? ఈ పండ్లు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయని తెలుసా? ఆయితే వాటి గురించి తెలుసుకోవడానికి కిందికి వెళ్లండి..
అచ్చం పాము స్కిన్ లా ఉండే ఈ పండ్లను ‘సలాక్’ పండ్లు అని అంటారు. ఇవి చూడ్డానికి భయంకరంగా ఉన్నా.. మానవ శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇందులో అనేక విటమిన్లు లభిస్తాయి. సలాక్ ప్రూట్ లో విటమిన్ సి, ఫైబర్, బీటా కెరోటిన్ వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి తీసుకోవడంతో శరీరంలో ఎలాంటి మలిన పదార్థాలు ఉన్నా తొలగిపోతాయి. అంతేకాకుండా ఇవి తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమేనని వైద్యులు సైతం తెలుుపుతున్నారు.

సలాక్ ప్రూట్స్ ఎక్కువగా ఇండోనేషియా దేశంలో కనిపిస్తాయి. ఈ దేశంలోని బాలి, తైమూర్ ద్వీపాల్లో సలాక్ ప్రూట్స్ ను చూడొచ్చని కొందరు ఆరోగ్య శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే వీటిని కొనుగోలు చేయాలంటే ఆన్ లైన్ సూపర్ మార్కెట్లో లభ్యమవుతాయని అంటున్నారు. పాము తోలు కలిగిన ఈ పండు మన తాటికాయలాగా గుండ్రంగా ఉంటుంది. ఇందులో ఒక విత్తనం మాత్రమే ఉంటుంది. దీనిని తీసేసి లోపలి తెల్లటి భాగాని తింటారు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది.

సలాక్ ప్రూట్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని కొందరు వైద్యులు తెలుపుతున్నారు. ఇందులో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది వృద్ధులకు, పిల్లలకు అదనపు శక్తి ఇస్తుంది. మెదడును చురుకుగా ఉండేందుకు ఇవి ఉపయోగడుతాయి. కంటిచూపు చక్కగా ఉండడానికి ఇది సహకరిస్తుంది.