Saturday, July 25, 2026

Union Education Minister: కేంద్ర మంత్రి ధర్మేంద్ర రాజీనామా

Union Education Minister: న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో దేశంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా నీట్ పేపర్ లీక్ పై విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వారి డిమాండ్లలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబట్టారు. దీంతో నైతిక బాధ్యత వహిస్తూ ఆయన శనివారం రాజీనామా చేశారు. నీట్ పరీక్షలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు చేస్తూ వారం రోజులగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేస్తున్న ఆందోళన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థులతో శుక్రవారం చర్చలు జరిపింది. విద్యార్థులు పెట్టిన మూడు డిమాండల్లలో రెండింటికి అంగీకరించిన ప్రభుత్వం మూడో డిమాండ్ అయిన కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రిరాజీనామా చేయాలనేది ఉంది. అయితే దీనిపై శనివారం మధ్యాహ్నం వరకు గడువు అడిగారు. చర్చలు జరపకపముందే కేంద్ర మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ వారం రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు బాధ కలిగింది. దేశానికి యువత ఎంతో అవసరం. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తన రాజీనామా లేఖను ఎక్స్ పోస్టులో పెట్టారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News