Tuesday, May 5, 2026

ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు: శాంటియాగో మార్టిన్ వారసుల జైత్రయాత్ర..

వ్యాపార సామ్రాజ్యంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శాంటియాగో మార్టిన్, ఇప్పుడు తన కుటుంబ సభ్యుల ద్వారా రాజకీయాల్లోనూ బలమైన ముద్ర వేశారు. ఇటీవల విడుదలయిన తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల్లో మార్టిన్ కుటుంబం నుంచి ముగ్గురు సభ్యులు వేర్వేరు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఓ వైపు లాటరీ వ్యాపారంలో ‘కింగ్’గా పేరున్న మార్టిన్..

ఇప్పుడు తన కుటుంబ సభ్యుల నుంచి మగ్గురు ఎమ్మెల్యేలుగా గెలుపొందడం చర్చనీయాంశంగా మారింది. శాంటియాగో మార్టిన్ (Santiago Martin) భారతదేశంలో ‘లాటరీ కింగ్’గా సుపరిచితులు. కోయంబత్తూరు కేంద్రంగా కొన్ని దశాబ్దాలుగా లాటరీ వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతన్నాడు. అయితే ఆయన భార్య, కుమారుడు, అల్లుడు తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.

తమిళనాడులో లీమా రోజ్ (మార్టిన్ భార్య) ఘనవిజయం

శాంటియాగో మార్టిన్ భార్య లీమా రోజ్, తమిళనాడు రాజకీయాల్లో తన సత్తా చాటారు. ఆమె AIADMK పార్టీ తరపున లాల్‌గుడి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తూ, ఆమె ఏకంగా 51,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. నియోజకవర్గంలోని ప్రజల మద్దతును కూడగట్టడంలో ఆమె విజయం సాధించడమే కాకుండా, పార్టీలో తన ప్రాధాన్యతను చాటుకున్నారు.

పుదుచ్చేరిలో కొడుకు జోస్ ఛార్లెస్ జోరు

తల్లి బాటలోనే మార్టిన్ కుమారుడు జోస్ ఛార్లెస్ కూడా విజయ కేతనం ఎగురవేశారు. ఆయన పొరుగు రాష్ట్రమైన పుదుచ్చేరిలోని కామరాజ్‌నగర్ నియోజకవర్గం నుంచి LJK పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల బరిలో నిలిచిన ఆయన 16,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది, యువ నాయకుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. తన తండ్రికి ఉన్న ప్రజాబలాన్ని, తనదైన శైలిలో ఓట్లుగా మార్చుకోవడంలో ఆయన విజయవంతమయ్యారు.

విల్లివాక్కంలో అల్లుడు ఆధవ్ అర్జున సంచలనం

ఈ విజయాల పరంపరలో మార్టిన్ అల్లుడు ఆధవ్ అర్జున పాత్ర కూడా తక్కువదేమీ కాదు. తమిళనాడులోని విల్లివాక్కం నియోజకవర్గం నుంచి TVK (తమిళగ వెట్రి కళగం) పార్టీ తరపున ఆయన పోటీ చేశారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఆధవ్ అర్జున 57,000 ఓట్ల భారీ మెజారిటీతో ప్రత్యర్థులను చిత్తు చేశారు. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని పార్టీ నుంచి పోటీ చేసి ఇంతటి ఘనవిజయం సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఒకే కుటుంబం నుంచి ముగ్గురు సభ్యులు, వేర్వేరు రాష్ట్రాల్లో, వేర్వేరు పార్టీల తరపున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలవడం భారత రాజకీయాల్లో ఒక అరుదైన విషయంగా నిలిచింది. ఇది శాంటియాగో మార్టిన్ కుటుంబానికి ఉన్న ఆర్థిక మరియు సామాజిక బలగాన్ని స్పష్టం చేస్తోంది.

TVK Chief Vijay ఇంటికి Tisha Krishnan..ఎందుకంటే..(వీడియో) – insightearth.in – Telugu News Portal

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News