Monday, September 28, 2026

డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్

RRB NTPC Recruitment 2026: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి ఆర్ఆర్ బీ గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో నాన్‌-టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీ (NTPC) గ్రాడ్యుయేట్‌ స్థాయిలో 3,477 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సంక్షిప్త నోటిఫికేషన్‌ ద్వారా వెల్లడించింది. త్వరలో పోస్టుల వారీగా పూర్తి వివరాలతో అధికారిక నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

RRB NTPC గ్రాడ్యుయేట్‌ లెవల్‌ కేటగిరీలో మొత్తం 3,477 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. దేశంలోని వివిధ రైల్వే జోన్ల పరిధిలో ఈ నియామకాలు చేపట్టనున్నారు. రైల్వేలో నాన్‌-టెక్నికల్‌ విభాగాల్లో పనిచేయాలనుకునే డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఈ నియామకం అవకాశం కల్పించనుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 8న ప్రారంభం కానుంది. అభ్యర్థులు నవంబర్‌ 6 వరకు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.

డిగ్రీ అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు
గ్రాడ్యుయేట్‌ స్థాయి పోస్టులకు సాధారణంగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. అయితే ఒక్కో పోస్టుకు అర్హత నిబంధనలు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా అకౌంట్స్‌, క్లరికల్‌ పోస్టులకు టైపింగ్‌ నైపుణ్యం వంటి అదనపు అర్హతలు ఉండవచ్చు.అందువల్ల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, ఇతర అర్హతలను తప్పనిసరిగా పరిశీలించాలి.

RRB NTPC గ్రాడ్యుయేట్‌ కేటగిరీలో ప్రధానంగా కింది పోస్టులను భర్తీ చేయనున్నారు:

  • చీఫ్‌ కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ సూపర్‌వైజర్‌
  • స్టేషన్‌ మాస్టర్‌
  • గూడ్స్‌ ట్రైన్‌ మేనేజర్‌
  • జూనియర్‌ అకౌంట్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌
  • సీనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌
  • ట్రాఫిక్‌ అసిస్టెంట్‌

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
RRB NTPC ఉద్యోగాలకు సాధారణంగా అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు (CBT), అవసరమైన పోస్టులకు టైపింగ్‌ స్కిల్‌ టెస్ట్‌/ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, అనంతరం డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ పరీక్ష వంటి దశల ద్వారా జరుగుతుంది. అయితే ఖచ్చితమైన పరీక్ష విధానం వివరాలను పూర్తి నోటిఫికేషన్‌లో RRB స్పష్టం చేయనుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News