పూలే బిసి సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కడారి అయిలన్న కురుమ
కరీంనగర్: భారత మహారాణి అహల్య బాయ్ జయంతి ఉత్సవాలను మే 31న రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుందామని పూలే బీసీ సంఘం స్టేట్ వర్కింగ్ కడారి అయిలన్న కురుమ పిలుపునిచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్ సమీపంలోని కురుమ సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇండోర్ రాజధానిగా.. మహేశ్వరం రాజధానిగా 30 సంవత్సరాల పాటు మహారాణి అహల్య బాయ్ ఏక దాటిగా పరిపాలన సాగించారని ఆయన తెలిపారు. గత సంవత్సరం ప్రధాన మంత్రి అహల్యభాయి 300వ జయంతి కార్యక్రమానికి ఇండోర్లో స్వయంగా హాజరయ్యారన్నారు. అంతేకాకుండా భారత ప్రభుత్వం ఇండోర్ విమానాశ్రయానికి ఆమె పేరు పెట్టడం ఆమె గొప్పతనానికి నిదర్శనమని తెలిపారు. అహల్యబాయి స్వయంగా కత్తి పట్టి గుర్రపు స్వారీ చేస్తూ యుద్ధం చేసేవారని, 60 సంవత్సరాల తన జీవితంలో 30 సంవత్సరాల పరిపాలన లో ఏ చక్రవర్తి చేయలేనని పనులు చేసి చూపించిన మహారాణి అని కొనియాడారు. కాశీ నుండి కన్యాకుమారి వరకు 157 దేవాలయాల పునరుద్ధరణ కానీ, సత్రాలు కానీ, రోడ్ల నిర్మాణం కాని, ప్రజల సౌకర్యార్థం నీటి వసతికాని ఏదో రకమైన మార్పు సూచించిన మహా రాణి అహల్యాబాయ్ అని అన్నారు.





