How to Check My Nami In SIR: దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ చేపడుతున్న Special Intensive Revision (SIR) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్ల వివరాలు సక్రమంగా నమోదయ్యాయా? లేదా? అనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే, ఇంట్లో నుంచే కేవలం ఒక SMS పంపడం ద్వారా మీ పేరు ఓటరు జాబితాలో నమోదైందో లేదో సులభంగా తెలుసుకోవచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు.
ముందుగా మీ మొబైల్‌లో మెసేజ్ బాక్స్‌ను ఓపెన్ చేయాలి. అందులో ECI అని టైప్ చేసి ఒక స్పేస్ ఇచ్చి, ఆ తర్వాత మీ EPIC (Voter ID) నంబర్‌ను నమోదు చేయాలి. ఉదాహరణకు ECI ABC1234567 అనే ఫార్మాట్‌లో టైప్ చేసి 1950 నంబర్‌కు SMS పంపాలి.మీ మెసేజ్ విజయవంతంగా పంపిన కొద్ది సేపటికే ఎన్నికల కమిషన్ నుంచి రిప్లై SMS వస్తుంది. అందులో మీ పేరు, సీరియల్ నంబర్, పార్ట్ నంబర్, పోలింగ్ కేంద్రం, నియోజకవర్గం వంటి వివరాలు కనిపిస్తాయి. దీంతో SIR ప్రక్రియలో మీ వివరాలు నమోదయ్యాయో లేదో నిర్ధారించుకోవచ్చు.
మద్యం ధరల పెంపు? – insightearth.in – Telugu News Portal
SMS సేవతో పాటు, Voter Helpline మొబైల్ యాప్ లేదా సంబంధిత రాష్ట్ర Chief Electoral Officer (CEO) వెబ్‌సైట్‌లో కూడా మీ EPIC నంబర్ ద్వారా ఓటరు వివరాలను తనిఖీ చేసుకోవచ్చు. అక్కడ కూడా మీ ఓటరు నమోదు స్థితి, పోలింగ్ స్టేషన్ వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీ పేరు కనిపించకపోయినా లేదా వ్యక్తిగత వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వెంటనే మీ పరిధిలోని బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) లేదా ఎన్నికల నమోదు అధికారిని సంప్రదించి అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. దీంతో మీ వివరాలను సరిచేసుకునే అవకాశం ఉంటుంది.

ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు కావడంతో ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో ముందుగానే నిర్ధారించుకోవాలని ఎన్నికల కమిషన్ సూచిస్తోంది. ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పుడే మీ వివరాలను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిదని అధికారులు తెలిపారు.





