నటుల రాజకీయ అరంగేట్రం అనగానే భారతీయ రాజకీయాల్లో మొట్టమొదటగా వినిపించే పేరు నందమూరి తారకరామారావు. దశాబ్దాలు గడిచినా.. ఎందరో స్టార్ హీరోలు రాజకీయాల్లోకి వచ్చినా.. ఎన్టీఆర్ సృష్టించిన ఆ ప్రభంజనం నేటికీ ఒక అజేయమైన రికార్డుగా నిలిచిపోయింది. ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో వెండితెర నటుడు విజయ్ (TVK) సాధించిన విజయంతో మరోసారి ఎన్టీఆర్ గురించి చర్చ తెరపైకి వచ్చింది. అదేంటంటే?
ఒకసారి ప్లాష్ బ్యాక్ లోకి వెళితే.. సినిమా ల్లో తనదైన నటనతో ఆకట్టుకునే ఎన్టీఆర్ (NTR) ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. ఈ క్రమంలో 1982లో తెలుగుదేశం పార్టీ (TDP)ని స్థాపించారు. ఆ తరువాత కేవలం 9 నెలల వ్యవధిలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కోటలను బద్దలు కొట్టారు. 1983 జరిగిన ఎన్నికల్లో ఆయన సాధించిన విజయం ఒక చరిత్రగా ఇప్పటికీ చెప్పుకుంటారు. ఎందుకంటే అప్పటి ఉమ్మడి ఆంధప్రదేశ్ లో 294 స్థానాలకు గానూ 201 సీట్లు గెలుచుకున్నారు. అంతేకాకుండా ఓట్ల శాతం ఏకంగా 46.3తో ప్రభంజనం సృష్టించారు. ఒక ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి రావడం.. అది కూడా దాదాపు 50 శాతం ఓట్ల షేర్‌ను దక్కించుకోవడం ఇప్పటికీ చెక్కుచెదరని రికార్డు అనుకోవచ్చు.
ప్రస్తుత రాజకీయాల్లోకి వస్తే.. సినీ నటుడు విజయ్ కోలీవుడ్ స్టార్ గా ఎదిగారు. ఆ తరువాత 2 ఫిబ్రవరి 2024లో ‘తమిళగ వెట్రి కళగం’ ( Tamilaga Vettri Kazhagam)పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన 14 నెలల తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ అసెంబ్లీలోని 234 స్థానాలకు 108 సీట్లు సాధించారు. 34.92 శాతం ఓట్లను కొల్లగొట్టారు. : రెండో అతిపెద్ద అరంగేట్రంసుమారు 40 ఏళ్ల తర్వాత, ఎన్టీఆర్ స్థాయికి దగ్గరగా వెళ్లిన ఏకైక నటుడిగా తమిళ దళపతి విజయ్ నిలిచారు. డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన ద్రావిడ పార్టీల మధ్య మూడో శక్తిగా ఎదిగి, తొలి ప్రయత్నంలోనే వందకు పైగా సీట్లు సాధించడం విజయ్ ఇమేజ్‌కు నిదర్శనం.
అయితే ఎన్టీఆర్ తరువాత ఎందరో నటులు రాజకీయ ఆరంగేట్రం చేసినప్పటికీ ఆయన దరిదాపుల్లోకి ఇప్పటి వరకు ఎవరూ చేరలేదు. అయితే ఎన్టీఆర్ తరువాత విజయ్ రెండో స్థానంలో నిలిచారు. కానీ ఎన్టీఆర్ రికార్డు ను మాత్రం చెరపలేదు. ఎందుకంటే పార్టీ స్థాపించిన తరువాత ఎన్టీఆర్ 201 సీట్లు గెలుచుకొని 46.3 ఓట్లశాతాన్ని షేర్ చేశారు. కానీ విజయ్ మాత్రం 108 సీట్లు గెలుచుకొని 34.92 శాతం ఓట్లను దక్కించుకున్నారు. అయితే ఎన్టీఆర్ తరువాత విజయ్ మాత్రమే ఉండడం విశేషం. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి, కమలాసన్ వంటి దిగ్గజాలు పార్టీలు స్థాపించినా..ఎన్టీఆర్ దరిదాపుల్లోకి రాలేకపోయారు.
| నటుడు – పార్టీ | అరంగేట్రం ఎన్నికలు | ఫలితం/ప్రభావం |
| ఎన్టీఆర్ (TDP) | 1983 | 201 సీట్లు (46.3%) – భారీ మెజారిటీతో అధికారం |
| విజయ్ (TVK) | 2026* | 108 సీట్లు (34.92%) – |
| చిరంజీవి (PRP) | 2009 | 18 సీట్లు (16% ఓట్లు) |
| విజయ్‌కాంత్ (DMDK) | 2006 | 1 సీటు (8.3% ఓట్లు) |
| కమల్ హాసన్ (MNM) | 2019/21 | సున్నా సీట్లు (3-4% ఓట్లు) |





