Tuesday, September 15, 2026

Gold Prices Fell in Hyderabad: పడిపోయిన బంగారం ధరలు.. ఈరోజు ఎలా ఉన్నాయంటే?

Gold Prices Fell in Hyderabad: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట కలిగినట్లయింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌ ప్రకారం.. మంగళవారం ఉదయం బంగారం ధరలు దిగివచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.920 తగ్గి రూ.1,53,170కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.850 తగ్గి రూ.1,40,400గా నమోదైంది. అంటే 24 క్యారెట్లతో పోలిస్తే ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా గణనీయంగా తగ్గింది.

gold price today
gold price today

దేశవ్యాప్తంగా కూడా స్వల్ప ఒడిదుడుకులు

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. సెప్టెంబర్ 15 ఉదయం బులియ్ మార్కెట్ ఆధారంగా నమోదైన జాతీయ రేటు ప్రకారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,51,920 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం రూ.1,39,260గా ఉంది. గత నెలతో పోలిస్తే బంగారం ధర దాదాపు 2 శాతం తగ్గినప్పటికీ, ఏడాది ప్రాతిపదికన మాత్రం గణనీయంగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,51,650, 22 క్యారెట్ల బంగారం రూ.1,39,013గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,51,380, 22 క్యారెట్ల ధర రూ.1,38,765గా నమోదైంది.

Maruthi Suzuki Price Hike: మారుతి కార్లు కొనేవారికి షాక్.. రూ.20 వేల వరకు ధరల పెంపు.. – insightearth.in – Telugu News Portal

వెండి ధరలు ఎలా ఉన్నాయి?

బంగారంతో పాటు వెండి ధరల్లోనూ ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 15 ఉదయం దేశవ్యాప్తంగా 999 స్వచ్ఛత కలిగిన వెండి కిలో ధర సుమారు రూ.2,32,570గా ఉంది. నగరాల వారీగా చూస్తే చెన్నైలో కిలో వెండి రూ.2,32,830, ముంబైలో రూ.2,32,150, ఢిల్లీలో రూ.2,31,750, కోల్‌కతాలో రూ.2,31,850, బెంగళూరులో రూ.2,32,340, హైదరాబాద్‌లో రూ.2,32,520గా నమోదైంది.

ఎందుకు తగ్గుతున్నాయి?

అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా డాలర్ బలపడటం, ముడిచమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ తదుపరి నిర్ణయాలపై ఉన్న అంచనాలు బులియన్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News