Monday, September 7, 2026

HDFC Bank MCLR Cut : లోన్లు తీసుకున్నవారికి గుడ్ న్యూస్..

HDFC Bank MCLR Cut : ఇప్పడు న్న కాలంలో బ్యాంక లోన్ లేని వారు చాలా తక్కవ మందే ఉంటారు. అందలోనూ కార్పొరేట్ బ్యాంక్ HDFC Bank నుంచి తీసకున్నవార చాలా ఎక్కవే అయితే ఈ బ్యాంక కస్టమర్లకు ఇప్పడు కాస్త ఊరట లభించింది. బ్యాంక్ పలు టెన్యూర్లకు సంబంధించిన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ ను తాజాగా బ్యాంకు తగ్గించింది. సెప్టెంబర్ 7, 2026 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. వివిధ టెన్యూర్లపై 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల వరకు కోత విధించడంతో బ్యాంకు MCLR ప్రస్తుతం 7.90 శాతం నుంచి 8.60 శాతం మధ్యకు చేరింది. గతంలో ఇది 8 శాతం నుంచి 8.65 శాతం వరకు ఉండేది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళితె..

ఎంసీఎల్ఆర్ అంటే ఏమిటి?

MCLR అంటే Marginal Cost of Funds-based Lending Rate. సింపుల్‌గా చెప్పాలంటే బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు ఉపయోగించే ఒక బెంచ్‌మార్క్ రేటు. ఒక రుణం ఎంసీఎల్ఆర్ తో అనుసంధానమై ఉంటే.. అందులో మార్పు వచ్చినప్పుడు, రుణం రీసెట్ తేదీ ఆధారంగా వడ్డీ రేటులో కూడా మార్పు రావచ్చు.

Maruthi Suzuki Price Hike: మారుతి కార్లు కొనేవారికి షాక్.. రూ.20 వేల వరకు ధరల పెంపు.. – insightearth.in – Telugu News Portal

దేనిపై ఎంత తగ్గుతుంది?

హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ ను 8 నుంచి 7.90 శాతానికి తగ్గించింది. ఒక నెల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ కూడా 8 శాతం నుంచి 7.90 శాతానికి వచ్చింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.15 శాతం నుంచి 8.05 శాతానికి తగ్గగా.. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.30 శాతం నుంచి 8.25 శాతానికి చేరింది. ఏడాది టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 8.40 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 8.55 శాతం నుంచి 8.45 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 8.60 శాతానికి తగ్గింది.

అందరికీ ఈఎంఐ తగ్గుతుందా?

బ్యాంకు ఎంసీఎల్ఆర్ తగ్గించినంత మాత్రాన ప్రతి లోన్ కస్టమర్ ఈఎంఐ వెంటనే తగ్గుతుందని అనుకోవద్దు. ముఖ్యంగా మీ లోన్ ఎంసీఎల్ఆర్తో లింక్ అయి ఉందా? మీ రుణానికి సంబంధించిన వడ్డీ రేటు రీసెట్ ఎప్పుడు ఉంది? అనే అంశాలపై ప్రయోజనం ఆధారపడి ఉంటుంది. ఇది ఉన్నవారికి రీసెట్ తేదీ వచ్చిన తర్వాత కొత్త రేటు వర్తించే అవకాశం ఉంటుంది.

ఎవరికి ఎక్కువ ప్రయోజనం ఉండొచ్చు?

ఎంసీఎల్ఆర్ ఆధారంగా వడ్డీ రేటు నిర్ణయించే హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఆటో లోన్ లేదా ఇతర రుణాలు తీసుకున్నవారికి ఈ తగ్గింపు ప్రయోజనం కలిగించే అవకాశం ఉంది. అయితే రుణం ఎంసీఎల్ఆర్ కు లింక్ అయి ఉండటం, బ్యాంకుతో చేసుకున్న ఒప్పందంలోని రీసెట్ నిబంధనలు కీలకం. కొత్తగా తీసుకున్న చాలా ఫ్లోటింగ్-రేట్ రిటైల్ లోన్లు సాధారణంగా ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌కు అనుసంధానమై ఉండటంతో వాటిపై ఎంసీఎల్ఆర్ తగ్గింపు నేరుగా ప్రభావం చూపకపోవచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News