Tuesday, April 21, 2026

Honda యూనికార్న్, Bajaj పల్సర్ ఏది కొనాలి? ధరల్లో తేడాలేంటి?

మార్కెట్లోకి ఎన్ని బైక్స్ వచ్చినా.. కొందరు బ్రాండెడ్ వాటినే కొనుగోలు చేస్తారు. అయితే వాటిలో ఏదీ బెస్ట్ బైక్ అనే విషయంలో సందేహపడుతుంటారు. అయితే ఇంజన్, ధర, ఫీచర్లలో కాస్త తేడా ఉండడంతో ఎవరికీ ఏదీ కంపోర్టో చూసుకొని కొనుగోలు చేయాలని ఆటోమోబైల్ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో హోండా యూనికార్న్ 150 , బజాజ్ పల్సర్ 150 రెండూ ప్రముఖంగా నిలుస్తున్నాయి. ఈ రెండు వాహనాలు 150cc సెగ్మెంట్ కలిగినవే. కానీ ఫీచర్లు, ధరలు, పెర్ఫార్మెన్స్ ఆధారంగా పోలిక చేస్తే కాస్త తేడాలు కనిపిస్తాయి. మరి మీకు ఎలాంటి బైక్ నచ్చుతుందో చెక్ చేసుకోండి..

ఇంజిన్ & పెర్ఫార్మెన్స్:
పల్సర్ 149.5cc ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇది 13.8 bhp పవర్ ను, 13.25 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది టాప్ స్పీడ్ గంటకు 110 కిలోమీటర్లు. లీటర్ ఇంధనానికి ఇది 48 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. యూనికార్న్ 162.71cc ఇంజిన్ ఉండగా.. 13 bhp పవర్, 14.8 Nm టార్క్ తో స్మూత్, రిఫైన్డ్ రైడ్ ఇస్తుంది, మైలేజ్ లీటర్ ఇంధనానికి 50 kmకిలోమీటర్లు.

ఫీచర్బజాజ్ పల్సర్ 150హోండా యూనికార్న్
ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్డిజిటల్, బ్లూటూత్, USB, కాల్ అలర్ట్స్ డిజిటల్, సర్వీస్ ఇండికేటర్, క్లాక్
బ్రేక్స్డిస్క్/డ్రమ్, సింగిల్ చానల్ ABS (సెలెక్ట్ వేరియంట్స్) డిస్క్/డ్రమ్, సింగిల్ చానల్ ABS
మైలేజ్47-48 kmpl 50 kmpl
ఫ్యూయల్ ట్యాంక్15 L 13 L
వెయిట్148 kg 139 kg
గ్రౌండ్ క్లియరెన్స్165 mm 187 mm

పల్సర్ 150 ఎక్స్-షోరూమ్ ధర ₹1,10,810 నుంచి మొదలై ఆన్-రోడ్ ₹1.39 లక్షల వరకు (హైదరాబాద్ ప్రకారం ) ఉంటుంది. యూనికార్న్ ₹1,13,613 నుంచి ₹1.39 లక్షల వరకు. పల్సర్ స్వల్పంగా చౌకగా ఉంటుంది. కానీ యూనికార్న్ రిసేల్ వాల్యూ ఎక్కువగా ఉ:టుంది. లోయర్ మెయింటెనెన్స్‌తో లాంగ్-టర్మ్‌లో బెస్ట్ బైక్ అనుకోవచ్చు.

కంఫర్ట్ & రైడ్ క్వాలిటీ
యూనికార్న్ వైడ్ సీట్, బెటర్ సస్పెన్షన్‌తో లాంగ్ రైడ్స్‌కు బెస్ట్, వైబ్రేషన్ లెస్. పల్సర్ స్పోర్టీ పొజిషన్‌తో సిటీ రైడింగ్‌లో ఫన్, కానీ హీటింగ్ ఇష్యూస్ ఉండవచ్చు.

ఏ బైక్ బెస్ట్?
డైలీ కమ్యూటింగ్, మైలేజ్, రిలయబిలిటీ కోసం హోండా యూనికార్న్ బెస్ట్.. ముఖ్యంగా టెలంగాణ రోడ్లకు ఇది అనుగుణంగా ఉంటుంది. స్పోర్టీ లుక్, ఫీచర్లు కావాలంటే మాత్రం పల్సర్ ఎంపిక చేసుకోవచ్చు. మీ యూసేజ్ ప్రకారం డీలర్ వద్ద టెస్ట్ రైడ్ తీసుకోండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News