Tuesday, June 24, 2025

ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఈ కారు ధర ఎంతో తెలుసా?

లగ్జరీ కార్లు కొనడం అంటే కొందరికి క్రేజ్. ఎప్పుడు మార్కెట్లోకి ప్రీమియం కార్లు వస్తాయా? అని వీరు ఎదురుచూస్తుంటారు. ఇలాంటి వారి కోసం బెంజ్, తదితర కంపెనీలు నిత్యం గుడ్ న్యూస్ చెబుతూ ఉంటాయి. లేటేస్ట్ గా Rolls Royce రికార్డు సృష్టించే కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ‘La Rose Noire Drop Taxi’. దీనిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు అంటున్నారు. అంతేకాకుండా దీనిని కొనుగోలు చేయాలంటే ఆస్తులమ్మినా సరిపోవంట..

Rolls Royce La Rose Noire Drop Taxi కారులో 6.75 లీటర్ టర్బో ఇంజిన్ ఉంది. 563 బీహెపీ పవర్, 820 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు బాడీని కార్బన్ ఫైబర్ తో తయారు చేశారు. క్యాబిన్ లో చిన్న పాటి డ్యాష్ బోర్డు ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో ఎక్కువగా చేతితో చేసిన డిజైన్ పరికరాలనే అమర్చారు.

ఈ కారు ధర విషయానికొస్తే 31 మిలియన్ డాలర్లు. అంటే రూ.211 కోట్లకు పైగానే వెచ్చించాలి. దీంతో ‘ఇది కారు కాదు.. కరెన్సీ కుప్ప’ అని కొనియాడుతున్నారు. 2023 లో ఉత్పత్తి ప్రారంభమైన ఈ కారు రిలీజ్ ఎప్పుడవుతుందో ఇంకా డేట్ ప్రకటించలేదు. కానీ ఈ కారు ధర విషయం మాత్రం బయటకు వచ్చింది. దీనిని చూసి కారు ప్రియులు ఇంప్రెస్ అవుతున్నారు. అయితే ఫస్ట్ ఈ కారును ఎవరు దక్కించుకుంటారో చూడాలి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News