Home Loan లోన్ తీసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ప్రైవేటు బ్యాంకు HDFC హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఇటీవల నిర్వహించిన ఎంపీసీ సమావేశంలో ఆర్బీఐ రెపో రేటును మరోసారి యథాతథంగా కొనసాగించింది. ఇప్పటి వరకు 7 సార్లు అదేవిధంగా కొనసాగించింది. ఈ క్రమంలో HDFC తన వడ్డీ రేట్లను సవరించింది. ముఖ్యంగా గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. దీనిని మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్- బేస్డ్ లెండిరగ్ రేట్స్(ఎంసీఎల్ఆర్) అని పిలుస్తారు. ఈ మార్పులేంటి? దాని వల్ల వినియోగదారులపై ప్రభావం ఎలా ఉంటుంది?
HDFC బ్యాంక్ తన ఎంసీఎల్ఆర్ ను ప్రకటించింది. ఇది 2024 జూన్ 7 నుంచి అమల్లోకి వచ్చింది. బ్యాంక్ రెండేళ్ల కాలంలో రుణ రేటును ఐదు బేసిస్ పాయింట్లు అంటే 9.35 శాతం నుంచి 9.30 శాతానికి తగ్గించింది. ఫలితంగా అదే కాలవ్యవధికి గృహ రుణ రేట్లు తగ్గుతాయి. అయితే ఇతర కాల వ్యవధిలపై ఎంసీఎల్ఆర్ ను బ్యాంకు మార్చలేదు. యథావిధిగా కొనసాగించింది. దీంతో HDFC ప్రస్తుత ఎంసీఎల్ఆర్ 8.95 శాతం నుంచి 9.35 శాతం మధ్య కొనసాగుతోంది.. ఇది వినియోగదారులకు తక్షణమే ఎలాంటి ప్రభావం ఉండదంటున్నారు. ఎంసీఎల్ఆర్-ఆధారిత గృహ రుణాల కోసం రీసెట్ వ్యవధి ఉంది.ౌ
ఆ తర్వాత రుణగ్రహీతల కోసం రేట్లు సవరణ చేసే అవకాశం ఉంది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్- బేస్డ్ లెండిరగ్ రేట్స్(ఎంసీఎల్ఆర్) అంటే బ్యాంక్ డబ్బును రుణంగా ఇవ్వగల కనీస వడ్డీ రేటు. ఇది బ్యాంక్ నిధుల ఖర్చు, నిర్వహ ణ ఖర్చులు, పదవీకాల ప్రీమియం వంటి అంశాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. తక్కువ ఎంసీఎల్ఆర్ అంటే సాధా రణంగా తక్కువ ఈఎంఐలు లేదా తక్కువ లోన్ కాల వ్యవధి.