Tuesday, June 24, 2025

మహిళలు ధరించే గాజులు ఎన్ని రకాలు? గ్రీన్ కలర్ గాజులు ఎందుకు ధరించాలి?

భారతీయ మహిళలు సాంప్రదాయ ఆలంకరణలో వస్త్రాధరణతో పాటు పలు ఆభరణాలు ధరిస్తారు. ఇవి కొందరు ఖరీదైనవి వాడుతూ ఉంటారు. మరికొందరు సాధాసీధాగా వేసుకుంటారు. కానీ అన్ని వర్గాల వారు మాత్రం ఒకే రకమైన గాజులు వేసుకుంటారు. సామాన్యుల నుంచి ధనికుల వరకు అందరూ గాజు గ్లాసులు వేసుకుంటారు. పలు రకాల రంగుల్లో ఉన్న ఈ గాజులు వస్త్రాలకు మ్యాచింగ్ అయ్యే విధంగా చూస్తారు. అయితే మహిళలు గాజులు ధరించడం శుభప్రదమే కాదు.. ఆరోగ్యం కూడా అని కొన్ని పరిశోధనలు తేల్చాయి. ముఖ్యంగా గ్రీన్ కలర్ గాజులు వేసుకోవడం వల్ల అంతా మంచే జరుగుతుందని కొందరు పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎన్ని రకాల గాజులు వాడకంలో ఉన్నాయి? ఎవరెవరు ఏ గాజులు వాడుతారు? ఆ వివరాల్లోకి వెళితే..

హిందూ సాంప్రదాయం ప్రకారం గాజులు ధరించడం వల్ల అదృష్టం వరిస్తుందని కొందరి నమ్మకం. అంతేకాకుండా ఇవి చేతికి ఉండడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.

  • శాస్రీయంగా చూస్తే .. గాజులను అమ్మవారితో పోలుస్తారు. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని ఒక రోజు గాజులతో అలంకరిస్తారు. అందువల్ల గాజులు ధరించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని అంటారు.
  • సైంటిఫిక్ గా చూస్తే.. గాజులు వేసుకోవడం వల్ల మహిళల్లో అలసట తగ్గుతుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది. ఎముకలు బలహీనంగా మారకుండా ఉంటాయి.ముఖ్యంగా గర్భిణీ సమయంలో సీమంత పేరిట చేతికి నిండుగా గాజులు వేస్తారు. ఇలా వేయడం వల్ల బిడ్డ బరువు పెరుగుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.

గ్రీన్ కలర్ గాజులు వేసుకోవడం వల్ల మహిళల్లో నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. బుధ గ్రహానికి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం. అందువల్ల మహిళలు పచ్చరంగు గాజులు ధరించడం వల్ల బుధగ్రహం అనుకూలంగా ఉంటుంది.

గాజులు నాలుగు రకాలుగా ఉన్నాయి. వీటిలో గాజుతో కొన్ని చేస్తారు. ప్లాస్టిక్, లక్క లేదా బంగారం గాజులు ఉంటాయి.

  • ప్రతి ఒక్కరూ గాజు గ్లాసుల వేసుకుంటారు. గాజు గ్లాసులు ఎక్కడైనా దొరుకుతాయి. సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకు అందరూ ఇదే రకమైన గాజులు వేసుకుంటారు.
  • ప్లాస్లిక్ గాజులు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా వాడుతారు. కొత్తగా పెళ్లయిన వారు వీటిని ధరించేందుకు ఇష్టపడుతారు.
  • లక్క గాజులు ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో ఉండేవారు ధరిస్తారు. ఒకప్పుుడు తెలుపులో మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఇవి వివిధ రంగుల్లో ఆన్ లైన్లోనూ లభిస్తున్నాయి.
  • బంగారం గాజులు కొందరు మాత్రమే ధరిస్తారు. ఉన్నత వర్గానికి చెందిన వారు మాత్రమే బంగారం గాజులు ధరిస్తారు.

మహిళల చేతికి ఎలాంటి గాజులు ఉన్నా.. అవి శుభప్రదాన్ని కలిగించడంతోపాటు ఆరోగ్యంగా ఉంటారని తెలుస్తోంది. అందువల్ల ఆడవారు గాజులు ధరించాలని పెద్దలు చెబుతున్నారు. కానీ నేటి యువతులు గాజులు ధరించుకోవడానికి ఇష్టపడడం లేదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News