Saturday, April 18, 2026

543 కి.మీ రేంజ్.. రూ. 21,000తో బుకింగ్.. E Vitaraకు స్పందన మాములుగా లేదు..

మారుతి సుజుకీ నుంచి మార్కెట్లకి వచ్చిన తొలి ఎలక్ట్రిక్ SUV e VITARA భారత మార్కెట్లో ప్రభంజనం సృష్టిస్తోంది. వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ SUV వెహికల్ 49 kWh, 61 kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లతో గరిష్టంగా 543 కి.మీ మైలేజ్ అందిస్తోంది. అయితే ఈ కారు మార్చిలో 2 వేలకు పైగా యూనిట్ల విక్రయాలు జరిగాయి.

మారుతి సుజుకీ భారత మార్కెట్లో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV e VITARAను 2026 ఫిబ్రవరి 16న అధికారికంగా లాంచ్ చేసింది. దేశంలోని వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ మోడల్, ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక సాంకేతికత, దీర్ఘ రేంజ్‌తో మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ SUV విభాగంలో బలమైన పోటీదారుగా నిలుస్తోంది.

e VITARA మార్చి 2026లో 2,205 యూనిట్ల విక్రయాలు చేసుకుంది. e VITARAకు MoM గ్రోత్ గణనీయంగా ఉంది: ఫిబ్రవరి 2026లో రిటైల్ 222 యూనిట్లు , వోల్‌సేల్ 870 యూనిట్లు అమ్ముడైనప్పటికీ.. మార్చిలో 2,205 యూనిట్లు అంటే సుమారు 10 రేట్లు రిటైల్ గ్రోత్ కనిపిస్తుంది. లాంచ్ తర్వాత మొదటి నెలలోనే ఇంత స్పందన రావడంతో మార్కెట్‌లో ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ ఎలక్ట్రిక్ SUVలో 49 kWh, 61 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 61 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్‌కు గరిష్టంగా 543 కి.మీ ARAI రేంజ్ లభిస్తుందని మారుతి ప్రకటించగా, చిన్న బ్యాటరీ ప్యాక్ కూడా నగర, హైవే మిక్స్ వినియోగానికి సరిపడే రేంజ్‌ను అందిస్తుంది.

ఈ కారు ప్రీమియం ఎలక్ట్రిక్ SUVగా కనిపిస్తుంది. ఇందులో 10.1-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ డ్రైవర్ సీట్, సన్‌రూఫ్, అంబియంట్ లైటింగ్, PM2.5 ఎయిర్ ఫిల్టర్, ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్ వంటి ఫీచర్లు దీన్ని టెక్నాలజీ రిచ్ మోడల్‌గా నిలబెడుతున్నాయి. సేఫ్టీ విషయంలో కూడా e VITARA బలమైన ప్యాకేజీగా వస్తోంది. ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్స్, లెవెల్ 2 ADAS, 360-డిగ్రీ కెమెరా, ESC, TPMS, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు చూపిస్తున్నాయి. ఇది Bharat NCAPలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది.

ధర విషయానికి వస్తే.. e VITARAకి ఇంట్రడక్టరీ BaaS ధర ₹10.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. సాధారణ ఎక్స్‌షోరూం ధరలు ₹15.99 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ వరకు సుమారు ₹20 లక్షల పరిధిలో ఉండగా, బ్యాటరీ సబ్స్క్రిప్షన్ మోడల్ ద్వారా కొనుగోలుదారులకు ప్రారంభ ఖర్చు తగ్గించే ప్రయత్నం చేసింది.

బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి మరియు కొనుగోలుదారులు ₹21,000తో NEXA ద్వారా ఈ కారును బుక్ చేసుకోవచ్చు. కంపెనీ అధికారిక ప్రకటన ప్రకారం డెలివరీలు కూడా ఫిబ్రవరి 16 నుంచే మొదలయ్యాయి, అయితే వేరియంట్, డిమాండ్, నగరాన్ని బట్టి వెయిటింగ్ పీరియడ్ మారే అవకాశం ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News