TG TET Results 2026: తెలంగాణలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) ఫలితాల విడుదలకు విద్యాశాఖ ముహూర్తం ఖరారు చేసింది. సెప్టెంబర్ 26, శనివారం ఉదయం 11 గంటలకు టెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షకు హాజరైన ఉపాధ్యాయులు అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలు, స్కోర్ వివరాలను చెక్ చేసుకోవచ్చు.
ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన ఈ ప్రత్యేక టెట్ పరీక్షకు మొత్తం 24,986 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 22,477 మంది పరీక్షకు హాజరయ్యారు. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించారు. పేపర్-1, పేపర్-2కు సంబంధించి వేర్వేరు సెషన్లలో పరీక్షలు జరిగాయి.విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 8న పేపర్-1తో పాటు పేపర్-2లోని సంబంధిత విభాగాలకు పరీక్షలు నిర్వహించారు. సెప్టెంబర్ 9న మిగిలిన మీడియంలకు సంబంధించిన పేపర్-2 పరీక్ష జరిగింది. మొత్తం మూడు సెషన్లలో పరీక్ష నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఫలితాలు ఎక్కడ చూడాలి?
TG TET ఇన్-సర్వీస్ ఫలితాలను అభ్యర్థులు https://tgtet.aptonline.in/ అనే
అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు.ఫలితాల లింక్ యాక్టివేట్ అయిన తర్వాత అభ్యర్థులు తమకు సంబంధించిన లాగిన్ వివరాలను నమోదు చేసి స్కోర్‌కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల్లో పొందిన మార్కులు, శాతం, అర్హత స్థితి వంటి వివరాలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
ముందుగా tgtet.aptonline.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
హోమ్‌పేజీలో కనిపించే TG TET In-Service Results 2026 లింక్‌పై క్లిక్ చేయాలి.
అడిగిన లాగిన్ వివరాలను నమోదు చేయాలి.
సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
స్క్రీన్‌పై టెట్ ఫలితం, మార్కుల వివరాలు కనిపిస్తాయి.
స్కోర్‌కార్డును డౌన్లోడ్ చేసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.





