Wednesday, September 16, 2026

ఢిల్లీకి అతిశీ ఎన్నో సీఎం? ఇప్పటివరకు ఎంతమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు?

ఢిల్లీ కొత్త సీఎంగా ఆప్ అతిశీ మర్లెనా సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింగ్ కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు.మంగళవారంసాయంత్రి ఆయన రాజీమానా చేయనున్నారు. ఆతరువాత ఆప్ మంత్రిగా ఉన్న అతిశీ మర్లెనాసింగ్ ముఖ్యమంత్రి కానున్నారు. ఆప్ లో కేజ్రీవాల్ తరువత అతిశీ కీలకంగాకొనసాగుతున్నారు. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తరువాత పార్టీ తరుపున ఆమె ప్రెస్ మీట్లు పెట్టేవారు. ఈ సందర్భంగా ఆమె గురించి వివరాల్లోకి వెళితే..

అతిశీ మర్లెనా సింగ్ 1981లో జన్మించారు. ఆమె తల్లిదండ్రు ఆమెకు మర్లెనా అని పేరు పెట్టగా.. తాను ‘అతిశీ’ అనిపేరు మార్చుకున్నారు. ఢిల్లీలోనే పుట్టి అక్కడే స్ప్రింగ్ డేల్స్ స్కూల్స్ లో చదువును పూర్తి చేసిన ఆమె 2001లో సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి పట్టా తీసుకున్నారరు. ఆ తరువాత ఇంగ్లండ్ వెళ్లి ఆక్స్ ఫర్ట్ యూనివర్సిటీ నుంచి హిస్టరీలో మాస్టర్స్ ఢిగ్రీ పూర్తి చేశారు. 2005లో ఆక్స్ ఫర్డ్ లోని మాగ్డలెన్ కాలేజీ రోడ్స్ స్కాలర్ గా వెళ్లారు.

2013లో అతిశీ మర్లెనా ఆమ్ ఆద్మీ పార్టీలో జాయిన్ అయ్యారు. 2015లో మధ్య ప్రదేశ్ లో నిర్వహించిన సత్యాగ్రహంలో ఆమె పాల్గొన్నారు. 202లో గోవా రాష్ట్రానికి ఇన్ చార్జిగా నియమితులయ్యారు. 2019లో లోక్ సభ ఎన్నికల సమయంలోఇన్ ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో తూర్పు డిల్లీ నుంచి పోటీ చేసిన బజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ పై 4.77 లక్షల తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత 202లో ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధరంబీర్ సింగ్ఖ పై 11,422 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ఢిల్లీకి ఇప్పటి వరకు (కేజ్రీవాల్ తో సహా)7గురు మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో 1952లో చౌధురి బ్రహ్మ ప్రకాశ్, 1955లో జీఎన్ సింగ్, 1993లో మదన్ లాల్ ఖురానా, 1996లో సాహిబ్ సింగ్ వర్మ, 1998లో సుష్మాస్వరాజ్, 1998లో షీలా దీక్షిత్, 2013 అరవింద్ కేజ్రీవాల్, 2015 అరవింద్ కేజ్రీవాల్ (రెండోసారి) బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు అతిశీ మర్లెనా సీఎంగా బాధ్యతలు చేపడితే 8వ ముఖ్యమంత్రిగా ఉండనున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News