Draft Voter List 2026:తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్రంలో SIR ప్రారంభానికి ముందు 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. ఇంటింటి సర్వే ద్వారా సేకరించిన వివరాలను అధికారులు డిజిటలైజ్ చేస్తూ ఓటర్ల జాబితాను ఫైనల్ చేశారు. దీంతో ప్రస్తుతం 2,64,87,213 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. గత జూలై 16 నాటికి 1,97,70,098 ఫారాలు అంటే 58.45 శాతం డిజిటలైజ్ అయినట్లు అధికారులు వెల్లడించారు.ఇందులో భాగంగా అధికారులు సోమవారం ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. ఇందులో ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం..
బీసీ మహిళలకు ‘ఇందిరమ్మ కుట్టు మిషన్లు’.. ఇలా అప్లై చేయండి.. – insightearth.in – Telugu News Portal
మీ ఓటు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి?
ముందుగా https://voters.eci.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లండి. ఇక్కడ download Electoral Roll అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ State సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన ఉన్న 2026 సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీనిప పక్కనే Roll type అని ఉంటుంది. ఇందులో దానిని 2026 సెలెక్ట్ చేసి పక్కన్న ఉన్న జిల్లాను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత అసెంబ్లీ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఉన్న క్యాప్చాను ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ పక్కన ఉన్న download selected pdfs అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పోలింగ్ బూత్ కు సంబంధించిన పీడీఎప్ లు కనిపిస్తాయి. అందులో రీసెంట్ గా మీరు ఎక్కడ ఓటు వేశారో దానికి సంబంధించి పీడీఎప్ డౌన్లోడ్ అవుతుంది. అందులో ఇంటి నెంబర్ ఆధారంగా మీ పేరు చెక్ చేసుకోవచ్చు.
పేరు కనిపించకపోతే ఏం చేయాలి?
సెర్చ్ చేసినప్పుడు మీ పేరు కనిపించకపోతే వెంటనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పేరు స్పెల్లింగ్‌లో స్వల్ప తేడా, నియోజకవర్గం మార్పు, చిరునామా మార్పు లేదా డేటా అప్‌డేషన్ కారణంగా కూడా సెర్చ్‌లో ఫలితం రాకపోవచ్చు. అందువల్ల పేరు వివిధ స్పెల్లింగ్‌లతో, నియోజకవర్గం/జిల్లా వివరాలతో మరోసారి ప్రయత్నించాలి. ECI పోర్టల్‌లో SIR-2026 కోసం గత SIR ఎలక్టోరల్ రోల్‌లో పేరును వెతికే ప్రత్యేక సదుపాయం కూడా ఉంది.
పేరు తొలగిపోయిందని అనిపిస్తే?
SIR ప్రక్రియలో అర్హత ఉన్న ఓటరు పేరు డ్రాఫ్ట్ జాబితాలో లేకపోతే, నిర్దేశించిన Claims & Objections వ్యవధిలో అభ్యంతరం లేదా క్లెయిమ్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. కొత్తగా ఓటరుగా నమోదు కావాల్సిన వారు Form 6 ద్వారా దరఖాస్తు చేయవచ్చు. ఇప్పటికే ఉన్న పేరులో చిరునామా లేదా ఇతర వివరాలను సరిచేయాల్సి ఉంటే Form 8 ఉపయోగించవచ్చు.
డెడ్, షిఫ్టెడ్, డూప్లికేట్ పేర్ల పరిస్థితి ఏంటి?
ఎన్నికల జాబితాలో మరణించిన వ్యక్తులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు లేదా ఒకటికంటే ఎక్కువ చోట్ల నమోదైన పేర్లను గుర్తించడం SIRలో ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి. అయితే ఒక ఓటరు పేరు పొరపాటున ఇలాంటి కేటగిరీలో చేరితే, సంబంధిత వ్యక్తి తన అభ్యంతరాన్ని అధికారులకు తెలియజేసి రికార్డును సరిచేయించుకోవచ్చు. Form 7లో డిలీషన్‌కు సంబంధించిన అభ్యంతరాలు, Form 8లో సవరణలు లేదా చిరునామా మార్పుకు సంబంధించిన దరఖాస్తులు చేసుకునే విధానం ఉంది.





