Saturday, July 4, 2026

Doddi Komuraiah: దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై నెలకొల్పాలి

కడారి అయిలన్న కురుమ జిల్లా అధ్యక్షులు కురుమ సంఘం

Doddi Komuraiah: కరీంనగర్: తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై నెలకొల్పాలని కురుమ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కడారి అయిలన్న కురుమ పిలుపునిచ్చారు. దొడ్డి కొమురయ్య కురుమ 80వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కడారి అయిలన్న కురుమ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఏప్రిల్ 3న జయంతి ఉత్సవాలు, జులై 4న వర్ధంతి వేడుకలు జరపడం చాలా సంతోషించదగ్గ విషయం అన్నారు. అయితే దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండి పైన మరియు అన్ని జిల్లా కేంద్రాలలో ప్రభుత్వమే నెలకొల్పి.. ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలన్నారు. వారి ధైర్య సాహసాలు నేటి యువతకు ఆదర్శం కావాలన్నారు.

కుల, మతాలకతీతంగా తెలంగాణ సాయుధ రైతాంగా పోరాటం చేసిన వీరుడు కామ్రేడ్ దొడ్డి కొమురయ్య అన్నారు. ఆనాటి దోపిడికి వ్యతిరేకముగా భూమికోసం, భుక్తి కోసం, భానిసలా సంకెళ్ళ విముక్తి కోసం పోరాడిన తొలి తెలంగాణ అమరుడు అన్నారు. నేటి యువత వీరిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో జరుగుతున్న అన్యాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా దైర్య సహసాలతో పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో పార్టీల నాయకులు గాని, సంఘాల నాయకులు గాని నెలకొల్పు కుంటున్న విగ్రహాలకు ఆటంకం కలగకుండా ప్రభుత్వమే చూసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో కురుమ మహిళ సంఘం జిల్లా అధ్యక్షురాలు కర్రె పావని కురుమ, రాష్ట్ర ఉపాధ్యక్షులు బీర్ల బీరయ్య కురుమ, జిల్లా కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి కర్రె రాజు కురుమ, జిల్లా సహాయ కార్యదర్శి జూలపల్లి రఘునందన్ కురుమ, ట్రస్ట్ అధ్యక్షులు చిగుర్ల శ్రీనివాస్ కురుమ, కురుమ పంచాయతీ కమిటీ జిల్లా అధ్యక్షులు కోరే గట్టయ్య కురుమ, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు శెవ్వళ్ల అక్షయ్ కురుమ, మాజీ కార్పొరేటర్ మీసా రమాదేవి కురుమ, కురుమ మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటి స్వరూప కురుమ, ఇరుమల్ల మల్లేశం కురుమ, రామడుగు మండల కురుమ సంఘం అధ్యక్షులు కడారి వీరయ్య కురుమ, మీస మాధురి కురుమ, చిటుకూరి శ్రీనివాస్ కురుమ, కర్రె రవి కురుమ, గడ్డల కోమలత కురుమ, చిగుర్ల యుగంధర్ కురుమ తదితర సంఘం నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News