Rajasthan Churu Sandstorm: న్యూఢిల్లీ/జయ్‌పూర్: ఉత్తర భారత దేశాన్ని వాతావరణ మార్పులు వణకిస్తున్నాయి. రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో మరోసారి భారీ ఇసుక తుఫాన్ (Dust Storm) బీభత్సం సృష్టించింది. సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి, గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు చురు (Churu) నగరాన్ని పూర్తిగా కమ్మేసాయి. చూస్తుండగానే భారీ ఇసుక మేఘాలు నగరాన్ని చుట్టుముట్టడంతో, మధ్యాహ్నం వేళలోనే నడిరాత్రిని తలపిస్తూ ఆ ప్రాంతమంతా చీకటిమయంగా మారింది.
వాహనదారులు దారి తెలియక రోడ్లపైనే వాహనాలను నిలిపివేశారు. ఊహించని ఈ ప్రకృతి విపత్తుకు సంబంధించిన భీతావహ దృశ్యాలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఢిల్లీని వణికిస్తున్న గాలి దుమారం
రాజస్థాన్ ప్రభావం దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాలపై (Delhi-NCR) కూడా తీవ్రంగా పడింది. ఢిల్లీలో భారీ గాలి దుమారం రేగింది. గంటకు 70 నుండి 90 కిలోమీటర్ల వేగంతో చండమారుతంలా ఈదురుగాలులు వీస్తున్నాయి. బలమైన గాలుల ధాటికి నగరంలో పలుచోట్ల చెట్లు, సైన్‌బోర్డులు విరిగిపడ్డాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఐఎమ్‌డీ తీవ్ర హెచ్చరిక (Red Alert):
వాతావరణం మరింత క్షీణించే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీకి ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. రాబోయే కొన్ని గంటల్లో బలమైన ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. బలహీనమైన కట్టడాలు, విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద నిలబడవద్దని హెచ్చరించారు. విమాన, రైలు సర్వీసులపై కూడా ఈ వాతావరణ ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
Churu,Rajasthan – A strong sandstorm swept through Churu, reducing visibility and plunging the day into darkness as dusty winds engulfed the district. The dust storm originated from the northern direction, bringing with it a mix of black and yellowish winds. Gusting at a speed of… pic.twitter.com/zpMhaLogzo
— NextMinute News (@nextminutenews7) June 15, 2026





