Roof Solar System: ప్రస్తుతం పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు, తరచూ ఎదురయ్యే కరెంట్ కోతల నేపథ్యంలో చాలామంది గృహ యజమానులు సోలార్ విద్యుత్ వ్యవస్థల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం సైతం సోలార్ ను అమర్చుకోవాలని ప్రోత్సాహం ఇస్తోంది. సొంతిల్లు ఉన్నవారికి ఇంటి పైకప్పును ఉపయోగించి సౌరశక్తితో విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి పెట్టుబడి పెడితే 20 నుంచి 25 సంవత్సరాల వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు. దీంతో నెలవారీ కరెంట్ బిల్లులు గణనీయంగా తగ్గడమే కాకుండా విద్యుత్ సరఫరాపై ఆధారపడటం కూడా తగ్గుతుంది. అయితే 100 గజాల ఇంటిపై సోలార్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? ఎంత వరకు విద్యుత్ ను వాడుకోవచ్చు?
100 చదరపు గజాల ఇల్లు అంటే సుమారు 900 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. అయితే మొత్తం పైకప్పు సోలార్ కోసం అందుబాటులో ఉండదు. నీటి ట్యాంకులు, మెట్లు, ఇతర నిర్మాణాల కారణంగా కొంత స్థలం తగ్గుతుంది. సాధారణంగా ఇలాంటి ఇంటి పైకప్పుపై 3 కిలోవాట్ల (kW) నుంచి 5 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ ప్యానెల్ వ్యవస్థను సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు. పైకప్పు పూర్తిగా ఖాళీగా ఉంటే 6 కిలోవాట్ల వరకు కూడా అమర్చే అవకాశం ఉంటుంది.
రోజుకు ఎన్ని యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది?
భారతదేశంలో సాధారణంగా రోజుకు 4.5 నుంచి 5.5 గంటల సమర్థవంతమైన సూర్యకాంతి లభిస్తుంది. ఈ లెక్కన 3 kW సోలార్ వ్యవస్థ రోజుకు సుమారు 12 నుంచి 15 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు. 5 kW వ్యవస్థ అయితే రోజుకు 20 నుంచి 25 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. వాతావరణ పరిస్థితులు, ప్యానెల్ నాణ్యత, నిర్వహణ వంటి అంశాలపై ఈ ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. అంతే శీతాకాలం, వర్షాకాలంలో అయితే సూర్య రశ్మి తక్కువగా ఉండడం వల్ల 50 శాతం తక్కువగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అయితే ప్యానెల్ నాణ్యత ఎక్కువగా ఉండి, వీటిని సరైన దిశలో ఏర్పాటు చేయడం వల్ల అవసరమైన విద్యుత్ ను పొందే అవకాశం ఉంటుంది.
ఏసీ, ఫ్రిజ్‌లను నడపవచ్చా?
ఖచ్చితంగా నడపవచ్చు. ఒక 1.5 టన్నుల ఇన్వర్టర్ ఏసీ గంటకు సగటున 1 నుంచి 1.5 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తుంది. ఫ్రిజ్ రోజుకు సుమారు 1 నుంచి 2 యూనిట్లు మాత్రమే ఖర్చు చేస్తుంది. 5 kW సోలార్ వ్యవస్థ ఉంటే ఏసీ, ఫ్రిజ్, ఫ్యాన్లు, టీవీ, వాషింగ్ మెషీన్, లైట్లు వంటి సాధారణ గృహ అవసరాలన్నింటినీ సులభంగా నడపవచ్చు. ముఖ్యంగా పగటిపూట సోలార్ ఉత్పత్తి అయ్యే సమయంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటే మరింత ప్రయోజనం ఉంటుంది.

బ్యాటరీ అవసరమా?
సోలార్ వ్యవస్థల్లో ప్రధానంగా రెండు రకాలుంటాయి. ఆన్-గ్రిడ్ , ఆఫ్-గ్రిడ్. ఆన్-గ్రిడ్ సిస్టమ్‌లో బ్యాటరీలు అవసరం ఉండవు. ఉత్పత్తి అయిన అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపించి, అవసరమైనప్పుడు తిరిగి వినియోగించుకోవచ్చు. ఆఫ్-గ్రిడ్ లేదా హైబ్రిడ్ సిస్టమ్‌లో బ్యాటరీలు ఉంటాయి. కరెంట్ కోతలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో హైబ్రిడ్ సిస్టమ్ మంచి ఎంపికగా భావిస్తారు.
పెట్టుబడి ఎంత అవుతుంది?
ప్రస్తుతం 3 kW సోలార్ వ్యవస్థకు సుమారు ₹1.5 లక్షల నుంచి ₹2.2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. 5 kW వ్యవస్థకు ₹2.5 లక్షల నుంచి ₹4 లక్షల వరకు వ్యయం కావచ్చు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల ద్వారా ఈ ఖర్చు మరింత తగ్గే అవకాశం ఉంది. సబ్సిడీ పొందిన తర్వాత పెట్టుబడి తిరిగి రావడానికి సాధారణంగా 4 నుంచి 6 సంవత్సరాలు పడుతుంది.
ఎస్సీలకు ఉపాధి.. ఎస్టీలకు నైపుణ్య శిక్షణ.. – insightearth.in – Telugu News Portal
దీర్ఘకాలికంగా లాభదాయకమైన పెట్టుబడి
సోలార్ ప్యానెల్స్ జీవితకాలం సాధారణంగా 25 సంవత్సరాల వరకు ఉంటుంది. ఒకసారి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తర్వాత నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. విద్యుత్ బిల్లుల్లో భారీ ఆదా, పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ స్వావలంబన వంటి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటే 100 గజాల ఇంటిపై సోలార్ ప్యానెల్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం ఒక మంచి దీర్ఘకాలిక పెట్టుబడిగా చెప్పవచ్చు. ముఖ్యంగా నెలకు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు కరెంట్ బిల్లు చెల్లించే కుటుంబాలకు ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
ప్రస్తుతం పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు, తరచూ ఎదురయ్యే కరెంట్ కోతల నేపథ్యంలో చాలామంది గృహ యజమానులు సోలార్ విద్యుత్ వ్యవస్థల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం సైతం సోలార్ ను అమర్చుకోవాలని ప్రోత్సాహం ఇస్తోంది. సొంతిల్లు ఉన్నవారికి ఇంటి పైకప్పును ఉపయోగించి సౌరశక్తితో విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి పెట్టుబడి పెడితే 20 నుంచి 25 సంవత్సరాల వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు. దీంతో నెలవారీ కరెంట్ బిల్లులు గణనీయంగా తగ్గడమే కాకుండా విద్యుత్ సరఫరాపై ఆధారపడటం కూడా తగ్గుతుంది. అయితే 100 గజాల ఇంటిపై సోలార్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? ఎంత వరకు విద్యుత్ ను వాడుకోవచ్చు?