Gold Rates Today: గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గాయి. మే 20 నాడు స్వల్పంగా పెరిగాయి.
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిణామాలు భారత్‌లో పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా దాడులను తాత్కాలికంగా ఆపేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే చమురు ధరలు తగ్గడం, ద్రవ్యోల్బణం భయాలు, వివాదాల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు.
గత మూడు రోజుల్లో సుమారు 2,000 రూపాయల వరకు తగ్గిన బంగారం ధరలు, ఈరోజు స్వల్పంగా పెరిగాయి. దేశీయంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 10 రూపాయలు పెరిగి 1,57,050 రూపాయల వద్ద ముగిసింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా 10 గ్రాములకు 10 రూపాయలు పెరిగి 1,43,960 రూపాయలకు చేరుకుంది. ధరలు స్వల్పంగానే పెరిగినప్పటికీ, వరుస పతనానికి బ్రేక్ పడటం మార్కెట్లో గమనార్హం.
గమనిక: పైన పేర్కొన్న ధరలు జీఎస్టీ (GST), మేకింగ్ ఛార్జీలు మరియు స్థానిక పన్నులకు ముందు ఉన్న మార్కెట్ సగటు ధరలు. మీ నగరాల్లోని జ్యువెలరీ షోరూమ్‌లను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో దేశీయంగా డిమాండ్ స్థిరంగా ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల తీవ్రత తగ్గితే రానున్న రోజుల్లో చమురుతో పాటు బంగారం ధరలు కూడా మరింత స్థిరపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇక కిలో వెండి ధర సుమారు రూ.2,66,000 నుంచి ₹2,85,000 మధ్య ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర సుమారు ₹2,70,900 వద్ద ఉంది. బెంగళూరులో రూ.2,84,900 గా నమోదైంది.ముంబై & ఢిల్లీ నగరాల్లో రూ.2,66,000 నుండి రూ. 2,70,500 మధ్య ఉంది.





