చెన్నై, మే 9: తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ప్రభుత్వం ఏర్పాటు కోకం ఎన్నో రకాల ట్విస్ట్ లు వస్తున్న నేపథ్యంలో మొత్తానికి టీవీకే (TVK) అధ్యక్షుడు విజయ్ ముఖ్యమంత్రి పదవి దిశగా అడుగు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు టీవీకే 107, కాంగ్రెస్ (5), సీపీఐ 2, సీపీఎం 2 పార్టీలతో పార్టీలతో 116 మ్యాజిక్ ఫిగర్ ఉండగా.. విదుతలై చిత్త పవర్ (VCK) పార్టీ తమ పూర్తి మద్దతుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా శనివారం సాయంత్రం TVKకు తమ 2 సీట్ల మద్దతు ఇస్తామని లేఖ రూపంలో స్పష్టం చేసింది. ఈ లేఖను TVK నేత ఆదవ అర్జున స్వీకరించారు. దీంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది.

కాంగ్రెస్, వామపక్షాలు, VCK ఎమ్మెల్యేల మద్దతుతో TVK శిబిరం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ను చేరుకుంది. పార్టీ వర్గాల ప్రకారం, ఈ సంఖ్యాబలంతో విజయ్ త్వరలోనే గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు.TVK వర్గాలు ఈ మద్దతుపై సంతోషం వ్యక్తం చేశాయి. “ఇది మా పార్టీకి పెద్ద బూస్ట్. త్వరలోనే ప్రభుత్వ ఏర్పాటు ఖరారవుతుంది” అని ఒక సీనియర్ నేత చెప్పారు. ఈ మ్యాజిక్ ఫిగర్ సాధించినా, అధికారిక ప్రకటన కోసం అంచి పడాల్సి ఉంది.
తమిళనాడు రాజకీయ వాతావరణం ఇప్పుడు TVK చుట్టూ తిరుగుతోంది. విజయ్ గవర్నర్‌తో భేటీ తర్వాత కొత్త సమీకరణాలు ఏమవుతాయో రాజకీయవేత్తలు ఆసక్తిగా చూస్తున్నారు.
BREAKING: VCK formally extends unconditional support to TVK for government formation in Tamil Nadu and submits the support letter backing Vijay’s leadership. pic.twitter.com/FrifmFWcmF
— Actor Vijay Team (@ActorVijayTeam) May 9, 2026





