Saturday, May 2, 2026

2026 ఏప్రిల్‌లో మారుతి సుజుకి, హ్యుందాయ్, కియా రికార్డు స్థాయి అమ్మకాలు.. వివరాలు ఇవే..

2026 ఏప్రిల్ లో భారత ఆటో రంగం ఘనమైన వృద్ధిని సాధించింది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, కియా మొదలైన ప్రముఖ కార్ల తయారీదారులు రికార్డు అమ్మకాలను నమోదు చేశాయి. దేశీయ మార్కెట్‌లో ఏప్రిల్ నెలలో మొత్తం 4.5 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇది గతేడాది ఏప్రిల్‌లోని 3.54 లక్షల యూనిట్లతో పోలిస్తే 27శాతం వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది. ఈ మూడు కంపెనీలు ఎన్ని కార్లు సేల్స్ అయ్యాయో చూద్దాం..

జీఎస్‌టీ 2.0 అమలు, ఆర్‌బీఐ రెపో రేటు తగ్గింపు, ఆదాయపు పన్ను రాయితీలు వంటి సానుకూల పరిస్థితులతో ఏప్రిల్ నెలలో కార్ల అమ్మకాల వృద్ధికి కారణమని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. SUVలు, కాంపాక్ట్ కార్లు, ఎలక్ట్రిక్ వాహనాలపై డిమాండ్ బలంగా ఉండటం, గ్రామీణ మార్కెట్ మెరుగుపడటం కీలక పాత్ర పోషించాయి. మారుతీ వద్ద ప్రస్తుతం 1.65 లక్షల బుకింగ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి.

ఏప్రిల్ నెలలో మారుతీ సుజుకీ మార్కెట్‌లో మొదటి స్థానాన్ని సాధించింది. దేశీయ అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించి 1,91,122 యూనిట్లు (ప్యాసింజర్ వెహికల్స్ 1,87,704) విక్రయించింది. ఇది గతేడాది ఏప్రిల్‌లోని 1,42,053 యూనిట్లతో పోలిస్తే 34.54% పెరిగింది. మొత్తం అమ్మకాలు 2,39,646 యూనిట్లకు చేరాయి. ఎగుమతులు 40,054 యూనిట్లు ఉండగా.. SUVలు 55,000 ప్లస్ యూనిట్లు, కాంపాక్ట్/మిడ్‌సైజ్ 80,659 యూనిట్లు, eVitara 2,006 యూనిట్లు (85% 61kWh వేరియంట్) అమ్ముడయ్యాయి.

హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా చరిత్రలోనే అత్యధిక ఏప్రిల్ అమ్మకాలు నమోదు చేసింది. దేశీయంగా 51,902 యూనిట్లు విక్రయించి 17శాతం వృద్ధి సాధించింది. ప్రభుత్వ పాలసీల మద్దతు, SUV డిమాండ్ దీనికి సహకరించాయి.

కియా ఇండియా 16% వృద్ధితో 27,286 యూనిట్లు అమ్ముడై తన చరిత్రలోనే బెస్ట్ ఏప్రిల్ సేల్స్ నమోదు చేసింది. Seltos, Sonetలు 10,000+ యూనిట్లు ఒక్కొక్కటి అమ్ముడయ్యాయి.

ఇతర బ్రాండ్‌లు కూడా మంచి అమ్మకాలు సాధించాయి. మహీంద్రా 56,331 యూనిట్లు (8శాతం వృద్ధి ), టాటా PV 59,000 యూనిట్లు (30.5శాతం వృద్ధి), టయోటా 30,159 యూనిట్లు (21శాతం వృద్ధి), రెనో 5,413 యూనిట్లు (2 శాతం వృద్ధి) సాధించాయి. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం ఆటో రంగం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందని ఆటోమోబైల్ నిపుణులు తెలుపుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News