రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు.. అని కొందరు అంటూ ఉంటారు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులను చూస్తే అదే కనిపిస్తోంది. మొన్నటి వరకు బద్ధ శత్రువులుగా ఉన్న ఇద్దరు అగ్ర నేతలు ఇప్పుడు మిత్రులుగా మారిపోతున్నారు. ఒకరు బీఆర్ఎస్ పార్టీ అధినేతగా తనదైన శైలిలో సత్తా చాటిన కేసీఆర్ కాగా.. మరొకరు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న జీవన్ రెడ్డి.. ఒకరిపై ఒకరు పోటీ పడి ప్రజల మద్దతు పొందిన వీరు అప్పుడు పోటీ పడి.. ఇప్పుడు భేటీ అవుతున్నారు. ఇప్పుడు ఒకే పార్టీలో ఉండడం చర్చనీయాంశగా మారింది.
అది తెలంగాణ ఉద్యమం.. ప్రత్యేక రాష్ట్రం కావాలని అన్ని వర్గాల ప్రజలు ఆందోళనకు రెడీ అయ్యే సమయం. ఈ తరుణంలో ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర్ రావు రాజకీయంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కొనసాగుతున్న తరుణంలో రాజకీయ ఉద్ధండులు పార్టీలోకొనసాగుతున్నారు. వీరిలో జీవన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. చంద్రబాబు, కేసీఆర్ సమకాలికుడైన జీవన్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆయన రాజకీయ చతురత ఎలా అంటే… ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలోనూ కేసీఆర్ పై పోటీకి ధైర్యంగా నిలబడ్డాడు. మొత్తం రెండుసార్లు పోటీ చేయగా.. ఒకసారి ఓడిపోగా.. మరోసారి గట్టి పోటీ ఇవ్వడం విశేషం.
2006లో..
2004లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందిన ఆయన కొందరు రాజకీయ పార్టీల నాయకులు చేసిన వ్యాఖ్యలకు మనస్థాపం చెందారు. దీంతో 2026 సెప్టెంబర్ 26న తన పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత కరీంనగర్ లోక్ సభ నుంచి పోటీకి నిలబడ్డారు. అయితే ఈ సమయంలో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కు ధీటైన వ్యక్తి అని భావించి.. అప్పుడు రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేస్తున్న జీవన్ రెడ్డిని బరిలోకి దింపారు. కానీ తెలంగాణ ఉద్యమంపై ఆసక్తి ఉన్న ప్రజలు కేసీఆర్ వైపే నిలిచారు. దీంతో 2 లక్షల ఓట్ల మెజారిటీతో కేసీఆర్ గెలుపొందారు.
2008లో..
అయితే మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కేసీఆర్ 2008లో మరోసారి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో మరోసారి కరీంనగర్ లోక్‌సభ ఉపఎన్నికల్లో కేసీఆర్, జీవన్ రెడ్డి పోటీ పడ్డారు. కానీ ఈసారి జీవన్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ కు 2,69,452 ఓట్లు రాగా.. జీవన్ రెడ్డికి 2,53,687 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ సహకారంతో జీవన్ రెడ్డి కేసీఆర్‌కు ముచ్చెమటలు పట్టించారు. కరీంనగర్‌లో తనకు ఎదురు లేదనుకున్న గులాబీ నేతను దాదాపు ఓటమి అంచులదాకా నెట్టి కేవలం 15 వేల మెజారిటీ మాత్రమే ఇచ్చారు. ఈ విజయం జీవన్ రెడ్డి రాజకీయ పటిష్ఠాన్ని చాటింది.
ఇలా రెండు ఎన్నికల్లో కేసీఆర్, జీవన్ రెడ్డిలు పోటీ పడ్డారు. అయితే ఇప్పుడు జీవన్ రెడ్డి కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు సిద్ధం కావడంతో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండనన్నది నిజం కాబోతుంది.





