Friday, March 20, 2026

రూ. 3.24 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ (2026-27)

తెలంగాణ రాష్ట్రం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,24,234 కోట్ల బడ్జెట్‌ను శుక్రవారం శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు

బడ్జెట్ మొత్తం వివరాలు

ఈ భారీ బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ. 2,34,406 కోట్లు, మూలధన వ్యయం రూ. 47,267 కోట్లుగా ప్రతిపాదించారు. ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని, రైతులు, మహిళలు, యువతపై దృష్టి సారించారని భట్టి ప్రసంగంలో స్పష్టం చేశారు.

కీలక పథకాలు

  • జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం అమలు.
  • కల్యాణ లక్ష్మి సాయం పెంపు, పెన్షన్‌లు రూ. 2,016కి పెంచే ప్రణాళిక.
  • ఇంటర్, ITI విద్యార్థులకు నెలకు రూ. 2,000 స్కాలర్‌షిప్.

శాఖల వారీ కేటాయింపులు

శాఖకేటాయింపు (రూ. కోట్లు)
వ్యవసాయం23,179
పశుసంవర్ధకం1,529
విద్య26,674
వైద్యం & ఆరోగ్యం13,679
విద్యుత్21,285
పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి33,688
సాగునీటి ప్రాజెక్టులు22,615
రవాణా12,759
పట్టణాభివృద్ధి17,907
ఎస్సీ సంక్షేమం11,784
ఎస్టీ సంక్షేమం7,937
బీసీ సంక్షేమం12,511
మైనారిటీ సంక్షేమం3,769
రాజీవ్ యువవికాసం6,000
గృహ నిర్మాణం7,430
ఐటీ & పరిశ్రమలు875 + 3,490

రెండేళ్ల పాలనలో ప్రజల వాగ్దానాలను నెరవేర్చుతున్నామని, రాష్ట్ర వృద్ధి రేటు 10.2%గా ఉందని భట్టి వెల్లడించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News