Thursday, March 19, 2026

మద్యం సేవించకున్నా.. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ లో పాజిటివ్.. ఎలా?

మద్యం తాగి వాహనం నడపడం ప్రమాదకరం.. ఈ ప్రమాదాలను నివారించడానికి డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహిస్తూ ఉంటారు. ఫంక్షన్లు, ఏదైనా కార్యక్రమాల్లో ఏ కొంచెం మద్యం తీసుకున్నా.. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ పాజిటివ్ వస్తూ ఉంటుంది. అయితే మోతాదును బట్టి జరిమానాలు, జైలు శిక్షలు వేస్తుంటారు. మద్యం తాగిన ప్రతి ఒక్కరూ దీనిని ఎదుర్కొక తప్పదు. కానీ మద్యం తాగకున్నా.. కూడా డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ లో పాజిటివ్ వస్తుందా? ఎలా వస్తుంది?

ఇటీవల కొన్ని పోస్టులు భయపెడుతున్నాయి. కొందరు ఎలాంటి మద్యం తీసుకోకున్నా.. తమకు మద్యం అలవాటు లేకున్నా.. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ లోపాజిటివ్ వస్తుందని ఆందోళన చెందుతున్నారు. అయితే బ్రీత్ ఎనలైజ్ మిషన్లలో ఉన్న సమస్యలేనని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్న ప్రకారం.. కడుపులో ఏర్పడిన రసాయనాల ద్వారా కూడా డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ లో పాజిటివ్ వస్తుందని అంటున్నారు.

మద్యం తాగని వారిలో.. అలవాటు కూడా లేని వారిలో డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ రావడానికి ప్రధాన కారణం Auto Bravery Syndrome. మనం తిన్న ఆహారంలో కొన్ని మార్పులు జరిగి ఇవి ఒక వాయువుగా మారుతాయి. ఈ వాయువు ఒక్కోసారి ఆల్కహాల్ గా మారిపోయి నోటి ద్వారా వస్తుందని అంటున్నారు. ఈ వాయువు నోటి ద్వారా వచ్చినప్పుడు మద్యం తాగిన వారిలాగే ప్రవర్తిస్తారు. తల తిప్పుతూ ఉండడం.. నీరసంగా ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. అలాగే మాట్లాడుతున్నప్పుడు తడబడుతూ ఉంటుంది.

అయితే ఇలా రావడానికి కొన్ని రకాల పదార్థాలు తినడమే కారణం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక వ్యక్తికి ఉన్న ఆరోగ్య సమస్యల పట్ల వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో.. వైద్యుల సూచనలు పాటించాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే ఈ సమస్య రాకుండా ఉండాలంటే ప్రూట్స్ లేదా.. వెజిటేబుల్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. లేకుంటే పై సమస్య వేధిస్తూ ఉంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News