Monday, September 14, 2026

మంచిరోజుల ‘మే‘.. ఈ నెలలో ఎక్కువగా శుభముహూర్తాలు..

ఉగాది తర్వాత కొత్త పంచాంగం అందుబాటులోకి వచ్చింది. శుభకార్యాలు నిర్వహించుకోవాలని అనుకునేవారు కొత్త పంచాంగం ప్రకారం శుభ తేదీలను చూసుకుంటూ ఉంటారు. హోలీ తర్వాత కొన్ని రోజులపాటు మంచి రోజులు కనిపించలేదు. అయితే ప్రస్తుతం ఏప్రిల్ నెలలో మంచి రోజులు రానున్నాయి. అలాగే మే, జూన్ లోనూ శుభముహూర్తాలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏప్రిల్ 16 నుంచి శుభముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. అసలు ఏ తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయా ఇప్పుడు చూద్దాం..


ఏప్రిల్ 16, 18, 20, 21, 23, 30 తేదీల్లో పెళ్లిళ్లు జరుపుకోవాలని పురోహితులు చెబుతున్నారు. అలాగే మే 1, 3, 4, 8, 9, 10, 11, 14, 16, 18, 21, 23, 24, 30 తేదీల్లో మంచి రోజులు ఉన్నాయని అంటున్నారు. ఇక జూన్లో 2,4,5,6,7,8 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. అయితే జూన్ 11 నుంచి జూలై 12 వరకు ఆషాడ మాసం రానుంది. దీంతో ఆ సమయంలో శుభ ముహూర్తాలు ఉండవు. మళ్లీ జూలై 25 నుంచి శ్రావణమాసం ప్రారంభం కావడంతో శుభ ముహూర్తాలు ఉండనున్నాయి. మే నెలో ఎక్కువగా 14 రోజుల పాటు మంచి రోజులు రానున్నాయి.

శుభకార్యాలు నిర్వహించుకునే వారు.. వివాహాలు చేసుకునేవారు ఆయా తేదీల్లో నిర్వహించుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు. అయితే వారి జాతకరీత్యా ఏ రోజు పెళ్లి ముహూర్తం బెటర్ అనేది సమీప పురోహితులను కలిసి నిర్ణయించుకోవాలని అంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News