Tuesday, June 24, 2025

‘విశ్వావసు’ అంటే ఏమిటీ? ఈ పేరుకు ఎలాంటి చరిత్ర ఉంది?

తెలుగు క్యాలెండర్ ప్రకారం 2025 మార్చి 30వ తేదీ నుంచి కొత్త ఏడాది ప్రారంభం కానుంది. ఈ ఏడాదిని ‘విశ్వా వసు’అని అంటారు. తెలుగు సంవత్సరాల్లో ఇది 39వది. అయితే ఈ ఏడాదిని విశ్వావసు అని ఎందుకు అంటారు? దీని అర్థం ఏంటి? అసలు విశ్వాసలు ఎవరు?

విశ్వా వసు అంటే విశ్వాసానికి నివాసం కలిగించిన వాడు అని అర్థం. అంటే దేవుడు అని అర్థం వస్తుంది. శ్రీ మహావిష్ణువు అందరికీ సంతోషాన్ని కలిగించి పరస్పర ప్రేమానురాగాలను పంచుతాడు కనుక ఆ స్వామి ఆశీస్సులు ఈ ఏడాది పాటు ఉంటాయని పండితులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాదికి విశ్వావసుడు అని పేరు ఎందుకు పెట్టారు? అసలు విశ్వావసుడు అంటే ఎవరు? ఆ చరిత్ర ఏంటి?

Ugadi 2025: కొత్త పంచాంగం ప్రకారం.. ఈ రాశుల వారు అదృష్టవంతులు.. – insightearth.in – Telugu News Portal

బ్రహ్మ పురాణం ప్రకారం.. విశ్వా వసు అనే గంధర్వుడు ఉండేవాడు. ఈయన గాయకుడు, నృత్యకారుడు.. ఈయన అప్సరసలతో ఎంతో ఆనందంగా జీవించేవారు.. ఈయన బ్రహ్మా నుంచి మరణం లేని వరాన్ని పొందినట్లు పురాణం తెలుపుతుంది. అయితే ఇలా తనకు చావు లేదని తెలిసి అహంకారిగా మారిపోతాడు. దీంతో ఇంద్రుడు పైనే దాడి చేస్తాడు. అయితే ఇంద్రుడు తన వజ్రాయుధంతో విశ్వావసుడి చేతులు కాళ్లు లేకుండా చేసి వికృత రూపాన్ని ఇచ్చినట్లు పురాణం తెలుపుతుంది. ఆ తర్వాత తన తప్పును తెలుసుకున్న విశ్వావసుడు తప్పును సరిదిద్దుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతాడు. అయితే రెండు పొడవైన చేతులతో రాక్షసుడిగా జీవించాలని ఇంద్రుడు ఆదేశిస్తాడు. తనకు శాప విముక్తి ఎప్పుడు జరుగుతుందో కూడా ఇంద్రుడు విశ్వా వసుడికి తెలియజేస్తాడు.

విశ్వావసు సంవత్సరం.. ఈ రంగాల వారికి అనుకూలం.. – insightearth.in – Telugu News Portal

దీంతో విశ్వా వసుడు త్రేతాయుగంలో రాక్షస అవతారంలో కనిపిస్తాడు. ఈ రాక్షసుడికి పొట్టలో కన్ను ఉండి పొడవాటి చేతులు ఉంటాయి. ఈయననే కబంధుడు అంటారు. ఈయన చేతుల్లో చిక్కిన వారు నలిగిపోవాల్సిందే. అందుకే కబంధ హస్తాలు అని అంటారు. అయితే రాముడు, లక్ష్మణుడు జఠాయువును చంపిన తరువాత ఈ కబంధుడు దారికి అడ్డు తలుగుతాడు. దీంతో కోపంతో రాముడు విశ్వావసుడి చేతులు తీసేస్తాడు. అయితే తనను చంపి అంత్యక్రియలు నిర్వహించమని విశ్వాససుడు రామలక్ష్మణులను కోరుతాడు. దీంతో వారు అంత్యక్రియలు నిర్వహించగా విశ్వాసుడిలోని రాక్షస రూపం కరిగిపోయి దివ్యరూపం బయటకు వస్తుంది. అలా విశ్వావసుడు తన అందమైన రూపంతో గంధర్వ లోకానికి వెళ్లిపోతాడు. ఆయన నామమునే తెలుగు సంవత్సరాల్లో ఒకదానికి పెట్టారని పండితులు చెబుతున్నారు.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News