పెళ్లంటే నూరేళ్ళ పంట అని అంటారు. జీవితంలో పెళ్లి అనేది చాలా కీలకమైన ఘట్టం. ఒక వ్యక్తికి రెండో జీవితం పెళ్లి తోనే ప్రారంభమవుతుంది. అయితే అందరూ అనుకున్నట్లుగా పెళ్లిళ్లు కాలేవు. కొందరు అనుకున్న విధంగా ప్రేమ వివాహాలు చేసుకుంటే.. మరికొందరు పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకుంటూ ఉంటారు. కానీ కొందరు ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుంటారు. ఇలా ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకొని జీవితాంతం బాధపడుతూ ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు మాత్రం కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటారట. ఆ తర్వాత వీరు జీవితంలో సుఖ శాంతులతో ఉంటారట. ఇంతకీ ఆ అదృష్ట రాశులు ఎవరంటే?
వృషభ రాశి వారు పెళ్లిళ్ల విషయంలో చాలా అదృష్టవంతులు అని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. శుక్ర గ్రహ పరిపాలనలో ఉన్న వీరు కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. అలాగే పెళ్లి చేసుకున్న వ్యక్తితో చాలా సంతోషంగా ఉంటారు. ఏ విషయంలో తొందరపడకుండా ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటారు. అలాగని వీరు ఎవరైనా ప్రేమిస్తే వెంటనే ప్రేమలో పడరు. ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వారితో ముందడుగు వేస్తారు. ఒకసారి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత వారితోనే జీవితాంతం కలిసి ఉంటారు.
కర్కాటక రాశి వారితో జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. వీరు తమ భావోద్వేగాలతో ఇతరులను కట్టిపడేస్తారు. ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. అయితే వీరిని పెళ్లి చేసుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. పెళ్లయిన తరువాత వీరు జీవితాంతం కలిసిమెలిసి ఉంటారు. తమ ఎమోషనల్ ఫీలింగ్స్ తో ఎదుటివారికి కన్నీళ్లు తెప్పిస్తారు. జీవితాంతం సుఖంగా ఉండాలని.. ఎదుటి వ్యక్తి తో సంతోషంగా ఉండాలని ఈ రాశివారు కోరుకుంటారు.
తులా రాశి వారు పెళ్లిళ్ల విషయంలో చాలా లక్కీ పర్సన్స్. వీరు ఎవరిని కోరుకుంటే వారిని పెళ్లి చేసుకుంటారు. ఒక్కోసారి ఒక వ్యక్తితో కనెక్ట్ అయితే జీవితాంతం కలిసి మెలిసి ఉంటారు. ప్రేమ, ఆప్యాయత చూపడంలో తులా రాశివారు ముందుంటారు. ఎదుటి వ్యక్తిని ఆకర్షించడానికి అందంగా తయారవుతారు. వీరితో జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తి కోసం వారు ఏదైనా చేయడానికి వెనుకాడరు. జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి చాలా ప్రయత్నిస్తారు.