Tuesday, June 24, 2025

చాణక్య నీతి: తెలివైన వ్యక్తులు తప్పులు చేయొద్దు..

అపర చాణక్యుడు రాజనీతి శాస్త్రమే కాకుండా వ్యక్తుల జీవితాలకు సంబంధించి ఎన్నో విలువైన విషయాలను ప్రజలకు అందించారు. చాలామంది మౌర్య సామ్రాజ్యం నుంచి నేటి వరకు చాణక్య నీతిని ఫాలో అవుతూ వస్తున్నారు. చాణక్యుడు చెప్పిన కొన్ని విలువైన విషయాలను పాటించడం వల్ల ఒక వ్యక్తి తన జీవితాన్ని సన్మార్గంలో పెట్టుకోవచ్చు అని మేధావులు అంటున్నారు. అలాగే కొన్ని సూత్రాలను పాటించడం వల్ల ఎలాంటి బాధలు లేకుండా జీవించవచ్చు అని కొందరు చెబుతారు. ఒక తెలివైన వ్యక్తికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. కానీ ఈ వ్యక్తి చేసే కొన్ని తప్పుల వల్ల.. కొన్ని స్నేహాల వల్ల అతడు జీవితాంతం బాధపడాల్సి వస్తుందని చాణిక్య నీతి చెప్పబడింది. అయితే ఆ వ్యక్తి ఏ పని చేయడం వల్ల తీవ్రంగా బాధపడుతాడు? ఎవరితో స్నేహం చేయడం వల్ల నష్టపోతాడు?

తెలివైన వ్యక్తులు ఇతరుల మంచి కోరుతారు అని అంటారు. ఒక్కోసారి ఈ వ్యక్తి నాయకుడు స్థానంలో ఉన్నప్పుడు న్యాయంగా మాత్రమే వెళ్లాలి. కానీ ఏదో సొంత స్వార్థంతో దుష్టులకు మద్దతు ఇవ్వడం వల్ల తన విలువను కోల్పోతాడు. అందువల్ల సొంతంగా కాస్త నష్టం చేకూరినా.. ఎదుటివారికిని న్యాయం అనుకుంటే ఆ పని చేయాలి. లేకుంటే ఆ తప్పు జీవితాంతం వెంటాడుతుంది. తెలివైన వ్యక్తి.. తనకంటే ఎక్కువ తెలివి ఉన్నవారితో స్నేహం చేయడం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. కానీ ఎప్పుడు దుఃఖంతో ఉన్న వ్యక్తితో స్నేహం చేయడం వల్ల అతడు కూడా బాధపడే అవకాశం ఉంటుంది

తెలివైన వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవడంలో తొడపడకూడదు. కీలక సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక పోతే అతడికి ఎంత తెలివి ఉన్నా పనికిరాదు. అయితే ఒక్కోసారి తాను తీసుకున్న నిర్ణయం సరైంది కాకపోయినా ఎదురయ్యే పరిస్థితులను తట్టుకోనగలిగే శక్తి ఉండాలి. అప్పుడే అతడు తర్వాత సరైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతాడు. అందువల్ల నిర్ణయాలు విషయంలో ఏ పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలి..

సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తులు ఎప్పుడూ తప్పుడు వ్యక్తులతో తిరగకుండా ఉండాలి. అలా చేయడం వల్ల వారికి కూడా చెడ్డ పేరే వస్తుంది. అలాగే ఒక విషయం చెప్తే వినని వారితో ఉండడం వల్ల మనసు ఆందోళనగా ఉంటుంది. అంతేకాకుండా అతనితో ఉండడం వల్ల తెలివైన వ్యక్తుల జ్ఞానం పోతుంది.

చాణక్య నీతి ప్రకారం.. చెడు గుణమున్న స్త్రీకి దూరంగా ఉండాలి. నిత్యం కోపం తెచ్చుకునే ఆడవారితో పాటు.. ఎదుటి వ్యక్తులకు విలువ ఇవ్వని వారితో స్నేహం చేయడం వల్ల ఎప్పటికైనా ప్రమాదమే. అందువల్ల తెలివైన వారు సమాజంలో గుర్తింపు పోకుండా ఉండాలంటే ఇలాంటి వారితో స్నేహం చేయకుండా దూరంగా ఉండాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News