ఆనంద కేళి హోలీ పండుగను దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఆడ, మగ.. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆడుకునే ఈ సంబరం 2025 సంవత్సరంలో మార్చి 14న చేసుకునేందుకు యువకులు, పెద్దలు రెడీ అవుతున్నారు. అయితే హోలీ అనగానే సాధారణంగా రంగులు పూసుకోవడం.. రంగుల నీళ్లు చల్లుకోవడం.. కొన్నిచోట్ల కోడిగుడ్లు, టమాటాలతో కొట్టుకోవడం వంటివి చూస్తుంటాం. కానీ కొన్ని గ్రామాల్లో హోలీ రోజున వింత ఆచారాలు పాటిస్తారు. అవేంటంటే?
ఒకరినొకరు కొట్టుకుంటూ..

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో హోలీ పండుగను విచిత్రంగా జరుపుకుంటారు. ఈరోజున గ్రామస్తులంతా కలిసి ఒకరినొకరు కొట్టుకుంటారు. అందరూ ఒకే చోట చేరి ఒకరిపై ఒకరు రక్తం వచ్చేలా పిడిగుద్దులు చేస్తారు. అరగంట పాటు ఇలా చేసిన తర్వాత ఒకరినొకరు ఆ లింగనం చేసుకుంటారు. ఈ క్రీడలో పాల్గొనకపోతే గ్రామంలో అరిష్ట ఉంటుందని పెద్దలు అంటున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనాలని చెబుతూ ఉంటారు.
గాడిదపై ఊరేగింపు..

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో విదా యెవ్తా అనే గ్రామం ఉంది. 86 ఏళ్ల కిందట ఈ గ్రామంలో వింత ఆచారం ప్రారంభమైంది. ఇక్కడ కొత్త అల్లుడిని గాడిద పై కూర్చోబెట్టి అతడికి రంగులు పూసి ఊరంతా తిప్పుతారు. ఈ క్రమంలో అతడికి కొందరు బహుమతులు అందిస్తారు. ఈ ర్యాలీ పూర్తయిన తర్వాత అత్తింటివారు కొత్త బట్టలు అందిస్తారు. ఒకప్పుడు ఆనందరావు దేశ్‌ముఖ్ అనే వ్యక్తి ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించారని.. అప్పటినుంచి దీనిని కొనసాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు..
మగవాళ్లు ఆడవారిలా..

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతే కుడ్లూరులో హోలీ పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజున పురుషులంతా మహిళా వేషధారణలో ఉంటారు. వీరిని ప్రతి మన్మధుడుగా భావించి పూజిస్తారు. ఇలా చేయడం వల్ల అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. ఫీలవలే పురుషులు చీరలు కట్టుకొని ఆభరణాలు ధరించుకుంటారు.
ఈ గ్రామాల్లో హోలీ నిషేధం..
హోలీ పండుగను దాదాపు దేశం మొత్తం జరుపుకుంటుంది. కానీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్ర ప్రయాగ్ జిల్లాలోని కుర్జాన్, క్విల్లి అనే గ్రామాల్లో మాత్రం 150 సంవత్సరాలుగా హోలీ పండుగను జరుపుకోవడం లేదు. ఈ పండుగను నిర్వహించుకుంటే తమ గ్రామ దేవత ఆగ్రహిస్తుందని నమ్ముతారు. అలాగే గుజరాత్ రాష్ట్రంలోని రామ్సన్ అనే ప్రదేశంలో కూడా హోలీ పండుగను నిర్వహించుకోరు. హోలీ పండుగ సమయంలో కామ దహణం చేయడం వల్ల ఈ గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగి అనేక ఇల్లు దగ్ధమయ్యాయి. అప్పటి నుంచి హోళిక ను దహనం చేస్తే తమ గ్రామం అగ్నికి ఆహుత అవుతుందని నమ్ముతారు. జార్ఖండ్‌లోని దుర్గాపూర్ అని గ్రామంలో కూడా హోలీ పండుగలు జరుపుకోరు..