Tuesday, June 24, 2025

కన్నప్ప టీజర్ లో ఇది గమనించారా?

మంచు విష్ణు హీరోగా వస్తున్న ఆధ్యాత్మిక మూవీ ‘కన్నప్ప’ మేకింగ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోహన్ బాబు భారీ బడ్జెట్ తో ఏవీఏ ఎంటర్ టైన్మెంట్ 24 ఫ్రేమ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం. ఇందులో మంచువిష్ణుతో పాటు కాజల్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తో పాటు ప్రత్యేక పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. అలాగే బ్రహ్మానందం, మధుభాల వంటి వారు తమ పాత్రల్లో కనిపించనున్నారు.

Kannappa Teaserను ఫిబ్రవరి 28న రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో కన్నప్ప గురించి చెప్పారు. ఆధ్యాత్మికంపై మనసు లేని ఓ వ్యక్తి శివుడికి భక్తుడిగా ఎలా మారుతాడు? అనేది ఇందులో ప్రాథమికంగా చెప్పారు. అంతేకాకుండా ఇందులో మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్ ఇతర నటులు కనిపిస్తారు. మహా శివుడిగా అక్షయ్ కుమార్ కనిపిస్తారు. మొత్తం అడవిలోని సీన్స్ కనిపించడంతో ఈ మూవీ మొత్తం ఫారెస్ట్ లోనే తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

ఇక ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే.. టీజర్ చివరిలో ప్రభాస్ (Prabhas)కనిపిస్తాడు. నుదుట విభూదితో మెల్లగా ఎంట్రీ ఇస్తాడు. ఈ సినిమాలో కన్న రుద్రగా కనిపించే అవకాశం ఉంది. అయితే ఆయన ఎలా అలరిస్తాడనేది మాత్రం సినిమాలో చూడాల్సిందే. ఈ మూవీని ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ‘శివ శివ శంకరా’ అనే సాంగ్ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ ఇంప్రెస్ అవుతున్నారు. మరి ఈ టీజర్ చూడాలంటే ఈ కింది వీడియోను చూడండి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News