మనుషులకు దగ్గరగా ఉండే పెంపుడు జంతువుల్లో శునకాలు ఒకటి. వీటిపై ఎంత ప్రేమ చూపిస్తే అవి తిరిగి మనుషులకు ఇస్తాయి. అందుకే చాలా మంది ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగే కుక్కలను పెంచుకుంటారు. వాటికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ వారి బాగోగులను చూసుకుంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి ఇంట్లో ఉండే పెంపుడు కుక్కలతో పాటు వీధిలో ఉండే కుక్కలు అరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో కుక్కులు అరవడం వల్ల కొంత మంది భయపడుతూ ఉంటారు. ఇవి అరవడం వల్ల ఏదో కీడు జరుగుతుందని భావిస్తారు. కానీ సైంటిఫిక్ గా ఆలోచిస్తే కుక్కులు ఎందుకు అరుస్తాయో తెలుసా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లి తెలుసుకోండి..
మాట్లాడడం చేయవు కానీ.. దాదాపు మనుషులకు ఉన్న మనసు కుక్కలకు ఉంటుంది. విశ్వాసానికి మారుపేరుగా వీటిని పేర్కొంటారు. నేటి కాలంలో చాలా మంది మనుషుల మధ్య ప్రేమలు కరువవుతున్నాయి. దీంతో కుక్కలను పెంచుకొని వాటితో స్నేహం చేస్తూ ప్రశాంతంగా ఉంటున్నారు. కుక్కలు సంతోషంగా గెంతులేయగలవు.. బాధొస్తే ఏడవగలవు.. అయితే వాటి ఏడుపునకు కీడు కారణం చెప్పడం వల్ల కొందరు వ్యతిరేకిస్తున్నారు.
సాధారణంగా మనుషుల కంటే కుక్కలకు గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇవి ఇన్ ఫ్రాసోనిక్ శబ్దాలను కూడా వినగలవు. అంటే మనుషులు వినలేని సౌండ్స్ ను కుక్కులు వింటాయి. కుక్కల శరీరాల్లో 20 హెచ్ జడ్ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ సౌండ్ లో వాటికి కొన్ని కొత్త శబ్దాలు వినిపిస్తాయి. దీంతో ఆ బాధను తట్టుకోలేక అవి అరుస్తూ ఉంటాయి. అలాగే కుక్కలు కొత్త వ్యక్తులను తమ ప్రాంతానికి రానీయకుండా ముందే హెచ్చరిస్తాయి. ఇలా ఏడ్వడం వల్ల సమీపంలో ఉన్న వారు అప్రమత్తంగా అవుతారు. ఒకవేళ రాత్రి సమయంలో కొత్త వ్యక్తులు కనిపించినా మొరగకుండా ఇలా ఏడుస్తాయి.
కుక్కలు కూడా ఒంటరితనాన్ని ఫీలవుతాయి. అందువల్ల అవి ఒంటరిగా ఉన్నామని భావిస్తే తట్టుకోలేక ఏడుపును ప్రారంభిస్తాయి. మిగతా కుక్కల దృష్టిని తమ వైపునకు తిప్పుకోవడానికి, తాము ఆందోళన చెందుతున్నామని చెప్పడానికి అవి ఇలా చేస్తాయి. మరో విషయమేంటంటే కుక్కలకు అనారోగ్యంగా ఉన్నా.. అవి తట్టుకోలేక బాధపడుతూ అరుస్తాయి. ఇవి పెంపుడు కుక్కులు అయితే వెంటనే వైద్యులకు చూపించడం మంచిది. అయితే చాలా మంది రాత్రి పూట కుక్కలు అరవడం వల్ల ఏదో జరుగుతుందని ఆందోళన చెందుతారు. కానీ వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. వాతావరణంలో మార్పులు వచ్చినా ఇవి అరుస్తాయి.