Tuesday, June 24, 2025

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తెగులోడి తెగువ.. ఎవరీ నితీశ్ రెడ్డి? ఈయన గురించి కోచ్ ముందే ఎందుకు అలా చెప్పాడు?

ప్రపంచ క్రికెట్ చూడడం అంటే చాలా మందికి ఇష్టం. కానీ ఇందులో ప్రత్యక్షంగా ఆడడం అంటే ఆషామాషీ కాదు. దిగ్గజ క్రికెటర్లతో పోరాడాల్సి వస్తుంది. అందులోనూ ఆస్ట్రేలియన్ వంటి వాళ్లను ఢీకొనడం అంటే మామూలు విషయం కాదు. కానీ కొత్త ఉత్సాహంతో క్రీజ్ లోకి అడుగుపెట్టిన ఓ తెలుగు కుర్రాడు ప్రత్యర్థులను ‘కంగారు’పెట్టాడు. ఐపీఎల్ లో తన అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్న ఈయన గురించి మందే కోచ్ మోర్నీ మోర్కెల్ హింట్ హిచ్చాడు. మనం ఊహించని దాని కంటే గొప్ప ప్రతిభ నితీశ్ రెడ్డిడి అని చెప్పాడు. అన్నట్లుగానే తన ప్రతిభ చూపించిన నితీశ్ రెడ్డి ఎవరు? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటీ?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ లో భాగంగా ఆసిస్ గడ్డపై భారత్ తాజాగా చేపట్టిన బ్యాటింగ్ లో పంత్ 37, రాహుల్ 26 పరుగులు చేయగా. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి 6 ఫోర్లు, ఒక సిక్సర్ తో కలిపి మొత్తం 41 పరుగులు చేశాడు. అయితే అందరికంటే ఎక్కువగా 69.49 బ్యాటింగ్ స్ట్రయిక్ రేటుతో ఈ పరుగులు చేయడంతో ఆయనపై అందరి దృష్టి పడింది. రిషబ్ పంత్ తో కలిసి జట్టుకు 150 పరుగులు అందించాడు. ఈ తరుణంలో నితీశ్ రెడ్డి గురించి తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి కలుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నంకు చెందిన కాకి నితీశ్ కుమార్ రెడ్డి 2003 మే 26న జన్మించాడు. కుడి చేతి వాటం బ్యాటింగ్ కలిగిన ఈయన 2019-20 రంజీ ట్రోఫీలో ఆంధ్ర తరుపున 2020 జనవరి 20న క్లాక్ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. 2020-21 విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఆంధ్ర క్రికెట్ జట్టు తరుపున లిస్ట్ ఏ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. 2021 నవంబర్ 4న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో టీ 20 మొదటిసారి ఆడాడు. 2023లో ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ నితీశ్ రెడ్డిని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.

సన్ రైజర్స్ తరుపున ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి అడుగుపెట్టిన నితీశ్ రెడ్డి అద్భుత ప్రతిభ చూపించాడు. అయితే మొదటిసారి అడుగుపెట్టిన ఆయన రెండు మ్యాచులు మాత్రమే ఆడి స్కోరు చేయలేదు. కానీ 2024 సీజన్ లో 13 మ్యాచులు ఆడి 303 పరుగులు చేశాడు.దీంతో ఆయనపై ఇండియన్ క్రికెట్ దృష్టి పడింది. ఈ క్రమంలో ఆయనను బోర్డర్ గవాస్కర్ టెస్ట్ ట్రోఫీలోకి తీసుకున్నాడు. ఎంట్రీతోనే నితీశ్ రెడ్డి 41 పరుగులతో ప్రత్యేకంగా నిలించాడు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందే కోచ్ మోర్నీ మోర్కెల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. నితీశ్ గొప్పగా బ్యాటింగ్ చేయగడనే నమ్మకం ఉంది. బౌలింగ్ లోనూ అతనికి ప్రతిభ ఉంది. జట్టులో ఆల్ రౌండర్ స్థానాన్ని భర్తి చేయడం నితీశ్ కు సాధ్యం.. అని చెప్పాడు. అనుకున్నట్లుగానే బ్యాటింగ్ లో నితీశ్ రెడ్డి తన ప్రతాపం చూపించాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News