Tuesday, June 24, 2025

హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ రూ. 7,390.. బ్యాంకాక్ లో ఉన్న 5 బెస్ట్ పర్యాటక ప్రదేశాలు ఇవే..

బ్యాంకాక్ వెళ్లాలని చాలా మందికి ఉంటుంది. అక్కడున్న అందమైన ప్రదేశంలో గడపాలని కోరుకునేవారు ఎందరో. అయితే బ్యాంకాక్ కు వెళ్లాలంటే సాధారణంగా అయితే హైదరాబాద్ నుంచి చెన్నై లేదా కోల్ కతా వెళ్లి అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చేది. దీంతో సమయంతో పాటు అదనపు ఖర్చులు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు థాయ్ ఏయిర్ ఏసియా సర్వీసెస్ తెలుగు రాష్ట్రాల వాసులకు బ్యాంకాక్ జర్నీ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి నేరుగా బ్యాంకాక్ వెళ్లొచ్చు. వాటి ఛార్జీలు ఎలా ఉన్నాయంటే?

థాయ్ ఎయిర్ ఏసియా వాణిజ్య విభాగానికి చెందిన తన్సితా హైదరాబాద్ లో గురువారం ఈ సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా విమాన చార్జీల గురించి వెల్లడించారు. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ కు నేరుగా వెళ్లే సర్వీసులు అక్టోబర్ 27 నుంచి ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 22న నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లే వారికి రూ.7,390 చెల్లంచాల్సి ఉంటుందని అన్నారు. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ కు వారంలో 3 సర్వీసులు ఉన్నట్లు తెలిపారు. ఇవే కాకుండా పుకెట్ నగరానికి వెళ్లాలంటే చెన్నై నుంచి వెళ్లొచ్చని పేర్కొన్నారు. చెన్నై నుంచి పుకెట్ వెళ్లాలంటే రూ. 6,9990 చెల్లించాలని తెలిపారు.

హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ కు ఎందుకు వెళ్లాలి? అక్కడ ఎలాంటి అందమైన ప్రదేశాల్లోకి వెళ్లాలి? ఆ వివరాల్లోకి వెళితే..

వాట్ అరుణ:
ఇక్కడికి కుటుంబంతో కలిసి వెళ్లొచ్చు. దీనినే టెంపుల్ ఆఫ్ ది డాన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ అద్భుతమైన ఆలయాలు ఉంటాయి. చావో ప్రయా నది పశ్చిమ ఒడ్డున ఇది ఉంటుంది. ఇక్కడ సూర్యాస్తమం అందంగా ఉంటుంది.

జిమ్ థాంప్సన్స్ హౌస్:
ఇది ప్రసిద్ధ అమెరికన్ గూఢాచారి థాయ్ లాండ్ నగరంలో ఉండి నిర్మించాడు. ఇది థాయ్ సాంప్రదాయాన్ని పోలి ఉంటుంది. ఇక్కడికి ఫ్యామిలీతో కలిసి వెళ్లొచ్చు.

గ్రాండ్ ప్యాలెస్:
బ్యాంకాక్ నగరం నగరం నడిబొడ్డున ఉన్న ఈ ప్యాలెస్ ప్రసిద్ధ కట్టడాల్లో ఒకటి.. ఇది రత్తనాకోసిన్ రాజ్యానికి చెందిన రాజు నివాసం. ఇక్కడ టెంపుల్ ఆఫ్ ది ఎమరాల్డ్ బుద్ధను కూడా చూడొచ్చు.

చావో ప్రయా నది:
ఇది బ్యాంకాక్ ఆకర్షిత ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ అద్భుతమైన భవనాలు ఉంటాయి. శీతాకాలంలో ఈ ప్రాంతం ఆహ్లదంగా ఉంటుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడికి వెళ్లొచ్చు.

లంఫినీ పార్క్:
ఇదో పెద్ద పార్క్. ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. వివిధ రకాల వృక్షాలు, జంతువులు ఉంటాయి. కొత్తగా పెళ్లయిన వారికి ఈ ప్రదేశం అనువుగా ఉంటుంది. కుటుంబంతో కలిసి ఒకరోజంతా ఇక్కడ గడపొచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News