ఒక వస్తువు కొనుగోలు చేయాలన్నా.. ఎవరికైనాడ డబ్బులు పంపించాలన్నా.. ఇప్పుడు అంతా మొబైల్ యాప్ నే వాడుతున్నారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రోజుకు లక్షలాది రూపాయలు ట్రన్జాక్షన్ సాగుతున్నాయి. బ్యాంకు ద్వారా నగదు లావాదేవీలు చేయడం కంటే ఇది సులభంగా ఉండడంతో అందరూ దీనికి కనెక్ట్ అయ్యారు. అంతేకాకుండా ఎక్కడికి వెళ్లినా మొబైల్ ఉంటే చాలు ఎంత మొత్తాన్నైనా పేమేంట్ చేసుకోవచ్చు. ఈ పేమేంట్ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు జరుగుతుంది. అయితే ఇప్పుడు క్యూఆర్ కంటే అడ్వాన్స్డ్ చెల్లింపు అందుబాటులోకి వచ్చింది. అదే స్మైల్ అండ్ పే. ఎవరైనా మనల్ని చూసి నవ్వితే పిచ్చోళ్లు అని అనుకుంటాం. కానీ ఇప్పుడు బిల్లు పేమేంట్ చేయాలంటే కాస్త నవ్వాలి. బిల్లు పేమేంట్ చేసేటప్పుడు మనసులో ఆందోళన ఉన్నా స్మైల్ చేస్తేనే అక్కడ నగదు లావాదేవీ జరుగుతుంది. అదేలాగంటే?
భారతదేశంలో డిజిటల్ పేమేంట్ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. వస్తు మార్పిడి నుంచి ఏటీఎం కార్డు ఉపయోగించి నగదును వాడుకుంటున్నాం. గత ఏడేళ్లలో క్యూఆర్ కోడ్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నారు. రూపాయి నుంచి లక్షల రూపాలయ వరకు క్షణాల్లో పేమేంట్ చేయాలంటే క్యూఆర్ కోడ్ ద్వారా ఈజీ అవుతుంది. అందువల్ల దీనిని గ్రామీణ ప్రాంతాల వారు సైతం వాడుతున్నారు. అయితే ఇప్పుడు కొత్త విధానం ద్వారా బిల్లును పేమేంట్ చేయొచ్చు. అంటే మీరు నవ్వితే చాలు బిల్లు చెల్లించినట్లే. ఈ విధానాన్ని ఫెడరల్ బ్యాంక్ ఆగస్టు 29, 2024న ప్రవేశపెట్టింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రత్యేకత చాటుకుంది.
ఈ విధానం ద్వారా డెబిట్ కార్డు అవసరం లేదు. మొబైల్ లేకున్నా నగదు లావాదేవీలు జరుపుకోవచ్చు.స్మైల్ అండ్ పే విధానం ఆధార్ గుర్తింపు ద్వారా సాగుతుంది. ఈ బిల్లు చెల్లింపు విధానం జరగాలంటేముందుగానే UIDAIలో ఆధార్ ద్వారా నమోదు చేసుకోవాలి. దీంతో ఎక్కడ పేమేంట్ చేసినా అది గుర్తించి బ్యాంకు ట్రాన్జాక్షన్ చేస్తుంది. మరో విధానం ద్వారా స్మైల్ అండ్ పే చేయాలంటే ముందుగా FED MERCHANT అనే అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ లో స్మైల్ అండ్ పే ఆప్షన్ ను ఎంచుకొని దాని ద్వారా మనీ ట్రాన్జాక్షన్ చేస్తారు. అయితే ఇది వస్తువులు కొనుగోలు చేయడానికి మాత్రమే వర్తిస్తుంది. స్మైల్ అండ్ పే ద్వారా నెలకు రూ. 50 వేల వరకు చెల్లించుకోవచ్చు. ఇక స్మైల్ అండ్ పే విధానం ఫెడరల్ బ్యాంకు వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఇతర బ్యాంకులు అందుబాటులోకి తీసుకొస్తారా? లేదా? చూడాలి.