Monday, September 14, 2026

ఆ ప్రాంతం కోసం ఇద్దరి మధ్య పోరాటం.. ‘సరిపోదా శనివారం’ట్విట్టర్ రివ్యూ

సాప్ట్, ఫ్యామిలీ చిత్రాల్లో మాత్రమే కనిపించే హీరో నాని ఇప్పుడు మాస్ సినిమాలను ఎక్కువగా చేస్తున్నారు. ఇదివరకు ఆయన తీసిన ‘దసరా’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో మరోసారి యాక్షన్ మూవీ ‘సరిపోదా శనివారం’తో గురువారం థియేటర్లోకి వచ్చాడు. విభిన్న పాత్రలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపే నాని సినిమా టైటిల్ చూడగానే ఆకట్టుకుంటుంది. అయితే టైటిల్ కు తగిన విధంగానే సినిమాలో మంచి కంటెంట్ ఉంటుందని సినిమా బృందం చెబుతోంది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత కొందరు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

‘సరిపోదా శనివారం’ సినిమలో నానితో పాటు ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటించారు. ఎస్ జే సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో నేచురల్ యాక్టర్ నాని, యాక్టింగ్ లో లీనమయ్యే ఎస్ జే సూర్యల మధ్య కాంబినేషన్ కుదురుద్ది అని ఇప్పటికే టాక్ వచ్చింది. ఈ సినిమాలో నాని డిఫరెంట్ పాత్రలో కనిపిస్తాడు. శనివారం మాత్రమే అతనికి కోపం వస్తుంది. అందుకే ఆరోజు అతి నుంచి ఎవరూ తట్టుకోలేరు. ఈ క్రమంలో ‘సోకులపాలెం’ అనే గ్రామంపై పోలీస్ అధికారి అయిన ఎస్ జె సూర్య పట్టి పీడిస్తుంటాడు. అయితే ఆ ఊరిని కాపాడడానికి హీరో ప్రయత్నిస్తాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య జరిగే వార్ ఆద్యంతం ఆకట్టుకోనుంది.

మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమాపై హోప్స్ పెరుగుతాయి. ట్విస్టులతో ఆసక్తిగా సాగుతుంది. అయితే కొన్ని సీన్స్ బాగా లెంతీగా ఉంచడంతో బోర్ కొడుతుంది. కథలో పాయింట్ ఆధారంగా కాకుండా కొన్ని ఎమోషన్స్ సీన్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే సెకండ్ ఆఫ్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకోనున్నాయి. అసలు కథలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత సినిమాపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇప్పటి వరకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లే కనిపిస్తుంది.

ఈ సినిమా తెలంగాణ రూ.12.50 కోట్లు, ఆంధ్ర 17.50 కట్లు కలిపి రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రెస్ట్ భారత్ రూ.5 కోట్లు, ఓవర్సీస్, రూ.6 కోట్ల బిజినెస్ చేసింది. మొత్తంగా రూ. 41 కోట్ల ఫ్రీ రిలీజ్ చేసింది. సినిమా పాజిటివ్ టాక్ వస్తే ఒకటి, రెండు రోజుల్లోనే పెట్టుబడుల తిరిగి వచ్చే అవకాశం ఉంది. దసరా, హాయ్ నాన్న హిట్టు సినిమాల తరువాత నాని చేసిన ఈ సినిమా పై ఆశలు భారీగానే ఉన్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News