Wednesday, June 25, 2025

రెండు పాత్రల్లో ‘దేవర’? ఓవర్సీస్ లోబుకింగ్స్ ఓపెన్..

ఎన్టీఆర్ లేటేస్టుగా నటించిన ‘దేవర’ మూవీ విడుదలకు సిద్ధమైంది. దీనిని సెప్టెంబర్ 27న థియేటర్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దేవర గురించి పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు కొరటాల, జూనియర్ ల మధ్య ఇప్పటికే వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీ సక్సెస్ అవుతుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దీనిని బట్టి చూస్తే ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నారా? అనే చర్చ సాగుతోంది. ఆ పాత్రలు ఎలా ఉంటాయంటే?

కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న ఇందులో జాన్వీ కపూర్ తో పాటు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎన్టీఆర్ కు సంబంధించిన లుక్స్ అన్నీ యాక్షన్ తో కూడుకొని ఉన్నాయి. అంతేకాకుండా సముద్రంలో పడవపై నిలుచొని ఉన్న ఫొటోలు వచ్చాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన ఫొటోను బట్టి చూస్తే ఇందులో రెండు పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

వీటిలో ఒకటి సముద్ర ప్రాంతంలో ఉండే దేవరగానూ.. మరోవైపు ఉత్తరాధిలో ఉండే కుర్రాడిగానూ కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా స్టోరీపై రకరకాల కథనాలు ఉన్నాయి. సముద్ర తీరంలో ఉన్న గ్రామాల్లోని ప్రజల కోసం దేవర పోరాడుతారని తెలుస్తోంది. అయితే రెండు పాత్రలు ఉంటే వీటిని ఎల కలుపుతారనేది ఆసక్తికర అంశం.

ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. కానీ అప్పుడే టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి…ఓవర్సీస్ లో సినిమా టికెట్స్ బుకింగ్ కు అవకాశం ఇచ్చారు. యూకేలోని కొందరు టికెట్స్ దక్కించుకున్నవారు వాటిని సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే సినిమా టికెట్ బుకింగ్ ఓపెన్ కావడంపై సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో చెప్పొచ్చని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News