Wednesday, June 25, 2025

ఈ ఫొటోలోని హీరో గుర్తున్నాడా? ఎవరో చెప్పుకోండి?

సినీ ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ వస్తే చాలని అనుకుంటారు. కానీ కొందరికి ఫస్ట్ మూవీనే హిట్టు కొట్టే అదృష్టం వస్తుంది. దీంతో వారు ఇక లైఫ్ లో సెటిలైపోయినట్లే అనుకుంటారు. కానీ అందరి విషయంలో ఇది జరగదు. భవిష్యత్ గురించి ఎవరూ అంచనా వేయరు. ముందు ముందు ఏం జరుగుతుంతో చెప్పలేం. బాగుంటుందన్న జీవితం సాధారణం అవుతుంది.. కష్టమవుతుందనకునేవారికి ఈజీ మార్గాలు ఏర్పడుతాయి. అయితే ఫై ఫొటోలోని ఓ హీరో ఓ సినిమాలో మెయిన్ హీరో కాకుండా సైడ్ హీరోగా నటించినా అతనికి గుర్తింపు వచ్చింది. చాలా మంది అతనికి ఫ్యాన్స్ అయిపోయారు. ఒక దశలో ఈయన ఇండస్ట్రీలో స్టార్ అవుతారనుకున్నారు. కానీ ఆ తరువాత కొన్ని సినిమాల్లో అవకాశం వచ్చినా రాణించలేకపోయారు. అయితే రీసెంట్ గా ఓ సినిమాలో కనిపించాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా?

2007 లో తెలుగు చిత్ర పరిశ్రమను షేక్ చేసింది ‘హ్యాపీడేస్’. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో అంతా కొత్తవాళ్లే నటించారు. వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్, గాయత్రీ రావులతో పాటు రాహుల్, సానియా దీప్తీలు నటించారు. వీరిలో రాహుల్ అని చెబితే ఎవరూ గుర్తుపట్టరు. అదే టైసన్ అంటే ఠక్కున గుర్తుకు వస్తుంది. టైస్ పాత్రలో నటించిన రాహుల్ ఎంతగానే ఆకట్టుకున్నాడు. హీరోతో సమానంగా నటించి మెప్పించాడు. ఇందులో సానియా దీప్తీ(శ్రావ్)తో నడిచే లవ్ ట్రాక్ చాలా బాగుంటుంది.

ఈ సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించారు. వీటిలో రెయిన్ బో, ముగ్గురు వంటి సినిమాలు ఉన్నాయి. కానీ ఏవీ ఆయనకు గుర్తింపు తీసుకురాలేదు. దీంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తరువాత వెంకటాపురం సినిమాలో నటించాడు. ఇది కూడా సక్సెస్ కాకపోవడంతో మరోసారి దూరమయ్యాడు. అయితే లేటేస్టుగా శివం భజే అనే సినిమాలో గ్యాంగ్ స్ట్ పాత్రలో నటించాడు.

అయితే హ్యాపీడేస్ సినిమాలో టైన్ చాలా సన్నగా కనిపిస్తాడు. ఇతని బాడీ స్టైల్ చూసి అతనికి కళాశాలలో టైసన్ అని పేరు పెడుతారు. కానీ ఆ తరువాత రాహుల్ వర్కౌట్లు చేస్తే హీరో రేంజ్ కు ఎదిగాడు. కానీ అతనికి అవకాశాలు మాత్రం రావడం లేదు. అయితే హీరో కంటే విలన్ బెటరని ఆలోచించిన ఆయన శిబం భజే మూవీలో గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించాడు. అయితే ఈ పాత్రతో మెప్పించాడు. ఇక రాహుల్ అలియాస్ టైసన్ పాత, కొత్త ఫొటోలతు ఆయన ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News