Wednesday, June 25, 2025

అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధం.. నేడు నిశ్చితార్థం.. అమ్మాయి అమెనే..!

అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమైనట్లు సమాచారం. అక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడోతరం వారసుడు నాగచైతన్య గతంలో సినీ నటి సమంతను పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది. ఆ తరువాత వీరు కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. అయితే తప్పు ఎవరిదైనా ఫ్యాన్స్ ఎవరి పక్షాన వారు ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో నాగచైతన్య రెండో పెళ్లి త్వరలో చేసుకుంటారన్న వార్తలు వచ్చాయి. ఆయన శోభిత అనే హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ అవి పుకార్లు కాదు నిజం అని గురువారం తేల్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ నేపథ్యంలో నాగచైతన్య, శోభితకు గురువారం నిశ్చితార్థం జరిగే అవకాశం ఉంది. ఇరు కుటుంబాలు చర్చించుకున్న తరువాత ఒక అంగీకారం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మొదటి పెళ్లి విషయంగో గందరగోళం ఏర్పడిన పరిస్థితుల్లో ఈ సమాచారాన్ని అప్పుడే మీడియాకు అందించలేదు. నిశ్చితార్థం పూర్తయిన తరువాత వీరి ఫొటోలను పెట్టి అధికారికంగా తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో త్వరలో అక్కినేని నాగార్జున ఇంట్లో త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి.

అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య ‘జోష్’ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్యకు ఆ తరువాత గౌతమ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఏమాయ చేశావె’తో బ్రేక్ వచ్చింది. ఈ సినిమాలో తనతో హీరోయిన్ గా చేసిన సమంతతో ఆయన ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి 2017 అక్టోబర్ 6న వివాహాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఆ తరువాత నాలుగేళ్లు కలిసిమెలిసి ఉన్న వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఎవరికి వారు ప్రకటించారు.

సమంతకు దూరంగా ఉన్న తరువాత వీరిద్దరిపై ఎన్నో వార్తలు వచ్చాయి. మళ్లీ వీరు కలవబోతున్నారని అన్నారు. ఆ తరువాత నటి శోభితతో ప్రేమలో ఉన్నారని, త్వరలో వీరు పెళ్లి చేసుకుంటారని చెప్పారు. కానీ చివరికి నాగచైతన్య శోభితతోనే కలిసి ఉండి జీవించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News